Switch to English

‘తెల్లవారితే గురువారం’ రివ్యూ – భరించడం చాలా కష్టం.

Critic Rating
( 1.50 )
User Rating
( 1.00 )

No votes so far! Be the first to rate this post.

Movie తెల్లవారితే గురువారం
Star Cast శ్రీ సింహ కోడూరి, చిత్ర శుక్ల, మిష నారంగ్, సత్య
Director మణికాంత్ గెల్లి
Producer రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ
Music కాల భైరవ
Run Time 2 గంట లు
Release మార్చ్ 27, 2021

‘మత్తు వదలరా’ సినిమా తర్వాత ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా, మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెల్లవారితే గురువారం‘. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రావడంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఎంటర్టైం చేసిందో ఇప్పుడు చూద్దాం..

కథ:

వీరేంద్ర(శ్రీ సింహా కోడూరి) – మధు(మిష నారంగ్)లకి పెద్దలు పెళ్లి కుదురుస్తారు. నైట్ రిసెప్షన్ అవుతుంది, తెల్లవారితే గురువారం పెళ్లి ముహూర్తం అనగా ఇద్దరూ కలిసి పెళ్లి నుంచి పారిపోతారు. అందులో వీరు తను గతంలో ప్రేమించిన అమ్మాయి కృష్ణవేణి(చిత్ర శుక్ల) కోసం పెళ్లి నుంచి బయలుదేరితే, మధు ఏమో పెళ్లి మీద భయంతో పెళ్లి వద్దనుకుంటుంది. ఇలా కలిసి బయలు దేరిన వీరి ప్రయాణం ఎలా జరిగింది? వీరు తాను ప్రేమించిన కృష్ణవేణి దగ్గరికి వెళ్తే ఎదురైన పరిణామాలు ఏంటి? తన దగ్గరే ఉండిపోయాడా? లేక వెనక్కి వచ్చేసాడా? ఈ జర్నీలో వీరు – మధుల మధ్య ఏం జరిగింది? ఫైనల్లీ ఉదయం పెళ్లి జరిగిందా? లేదా? అన్నదే కథ..

తెరమీద స్టార్స్..

శ్రీ సింహా కోడూరి రెండవ సినిమాతో నటనలో పరిపక్వత చూపించాడు. అటు లవ్ సీన్స్, ఇటు కామెడీ సీన్స్ లో మంచి నటనని కనబరిచి ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు. చిత్ర శుక్ల ఉన్నది చాలా తక్కువ సేపైనా కన్ఫ్యూజ్డ్ గర్ల్ పాత్రలో బాగా చేసింది. మిష నారంగ్ మొదటి సినిమా అయినా లుక్స్ పరంగానే కాకుండా నటనతోనూ మెప్పించింది. ఇకపోతే సినిమాకి ప్రధాన హైలైట్ సత్య.. తొందరపాటు అండ్ షార్ట్ టెంపర్ పాత్రలో తన సీన్స్ లో బాగా నవ్విస్తాడు. వైవా హర్ష కూడా అక్కడక్కడా నవ్విస్తాడు. రాజీవ్ కనకాల, అజయ్, శరణ్య ప్రదీప్ లు వారి వారి పాత్రల్లో మెప్పించారు.

తెర వెనుక టాలెంట్..

ట్రై యాంగిల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి కావాల్సిన బ్యూటీని సురేష్ రగుతు తన విజువల్స్ తో తీసుకొచ్చాడు. ప్రతి సీన్ లో తన ఫ్రేమింగ్ అండ్ లైటింగ్ తో విజువల్ మూడ్ ని క్రియేట్ చేయడంలో తన వర్క్ పరంగా బెస్ట్ ఇచ్చాడు. ఆ విజువల్స్ కి పర్ఫెక్ట్ మ్యూజిక్ అందించి కాల భైరవ వీలైనంతవరకూ సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసాడు. సత్య గిడుతూరి ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో పరవాలేధనిపించినా, సెకండాఫ్ లో మాత్రం కొన్ని అనవసరపు లాగ్ సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ఇస్తుంది. ఉదాహరణకి అజయ్ ట్రాక్ అసలే సినిమాకి అవసరం లేదు.

ఇక నూతన దర్శకుడు మణికాంత్ గెల్లి తీసుకున్న ట్రై యాంగిల్ లవ్ స్టోరీ పాయింట్ ని అడపాదపా చూసే ఉన్నాం. కానీ సందర్భానుసారంగా వచ్చే కామెడీతో సినిమాని నడిపించాలి అనుకున్నాడు. అనుకున్న దాని ప్రకారం సినిమా ప్రారంభం బాగుంది, పాటలకి పెట్టిన సమస్య బాగుంది, మొదటి అర్ధ భాగంలో కొన్ని మోమెంట్స్ తో కాసేపు బాగుంది, కాసేపు బోరింగ్ అంటూ లాగించేసిన ఓకే పర్లేదులే అనే ఫీలింగ్ వస్తుంది. కానీ కథకి కీలకమైన సెకండాఫ్ లో మాత్రం పాత్రలకి సరైన జస్టిఫికేషన్ లేదు. సింహా – మిషలని కలపడానికి రాసుకున్న ఎమోషనల్ సీన్స్ లో లాజిక్ గానీ, మేజిక్ గానీ ఏదీ ఉండదు. దీనికితోడు అనవసరపు సీన్స్ తో సాగదీత అవ్వడం వలన బాగా స్లోగా సాగుతుంది. స్క్రీన్ ప్లే అనేది ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ ఎందుకంటే 2 గంటల సినిమానే అయినా 4 గంటలు చుసిన ఫీలింగ్ వస్తుంది. డైరెక్టర్ మణికాంత్ అందరికీ తెలిసిన కథని ఎంగేజింగ్ గా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– శ్రీ సింహా కోడూరి నటన
– నవ్వించే సత్య కామెడీ సీన్స్
– విజువల్స్ అండ్ మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– రొటీన్ పంథాలో అనిపించే కథ
– సెకండాఫ్ కథనం
– అనవసరపు సీన్స్ తో సాగదీత
– స్లో నేరేషన్
– ఎమోషనల్ జస్టిఫికేషన్ లేకపోవడం
– వీక్ క్లైమాక్స్

విశ్లేషణ:

ట్రైలర్ చూసి ‘తెల్లవారితే గురువారం’ ఓ కామెడీ రైడ్ అనుకుంటారు, కానీ సినిమా చూసాక ఇదొక బోరింగ్ రైడ్ అని తలలు పట్టుకుంటారు. పాత్రలు, ప్రారంభం బాగున్నా అనుకున్న కథని, ఎమోషన్స్ ని సరిగా రీచ్ చేయలేకపోవడం వలన చూసే ఆడియన్స్ కి నీరసం తెప్పిస్తుంది. సరికొత్త కథలని ట్రై చేస్తున్న టైంలో ఒక యంగ్ టీం ఇలాంటి సినిమాని అటెంప్ట్ చేయడం బాధాకరం.

చూడాలా? వద్దా?: పిచ్చ లైట్ తీసుకోవచ్చు.

తెలుగుబులెటిన్. కామ్ రేటింగ్: 1.5/5

సినిమా

మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా

మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. దీని...

మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు...

కమెడియన్‌ ను దర్శకుడిగా తీసుకు రాబోతున్న నాగ్‌

ఎంతో మంది దర్శకులను పరిచయం చేసిన అక్కినేని వారు మరో దర్శకుడిని పరిచయం చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లు పునః ప్రారంభం...

రష్మిక ఇంటికి వెళ్లిన ఫ్యాన్‌.. పోలీసులు అరెస్ట్‌

హీరోలు మరియు హీరోయిన్స్‌ కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తమ అభిమాన స్టార్స్ ను చూసేందుకు ఎంత దూరం అయినా వెళ్తారు....

ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె...

రాజకీయం

నారా లోకేష్ పవర్ పంచ్: నడి రోడ్డు మీద కాల్చెయ్యమన్లేదు కదా.?

స్క్రిప్టు ఫాలో అవుతున్నారా.? లేదంటే, నిజంగానే నారా లోకేష్ రాజకీయ నాయకుడిగా తనలోని ‘పవర్ ఫుల్’ యాంగిల్ చూపిస్తున్నారా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో...

ఇసుక వర్సెస్ మట్టి.. నెల్లూరు ‘బులుగు’ ఫైట్.!

ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలు. పైగా ప్రజా ప్రతినిథులు. అందునా, కీలకమైన పదవుల్లో వున్న వ్యక్తులు. ‘పవర్’ వుంటే, దోచెయ్యాల్సిందే కదా.. అన్నట్టు, తమకు తోచిన రీతిలో దోచేస్తున్నారట. అందులో ఒకరి...

డెల్టా ప్లస్ వచ్చేసింది.. రాజకీయం చూస్తే సిగ్గేస్తోంది.!

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు. కొందరు రాజకీయ ప్రముఖులు కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఉప ఎన్నికలూ వచ్చాయి....

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో...

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్...

ఎక్కువ చదివినవి

పీసీఏ చైర్మన్ గా జస్టిస్ కనగరాజ్..! ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీలో పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ (పీసీఏ)ని రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాటు చేసింది. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణలో గతేడాది.. పలు...

అక్టోబర్ నాటికి థర్ద్ వేవ్..! ముప్పును ఎదుర్కోగలమనే అంటున్న నిపుణులు

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అక్టోబర్ నాటికి రావొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా తీవ్రత, రాబోయే రోజుల్లో కరోనా ప్రభావంపై జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో...

దేశంలో కరోనా మరణాల సంఖ్య దాస్తున్నారు

దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా కరోనా మరణాల సంఖ్య దాస్తున్నారు అంటూ ఐఐఎం ప్రొఫెసర్‌ చిన్మయి తుంబే అన్నారు. గత ఏడాది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరియు మరణాలతో పోల్చితే ఈ...

బులుగు రాజ్యాంగం: వీటిని ప్రభుత్వ ఉద్యోగాలని అనగలమా.?

అధికార వైసీపీ పాలనలో, గౌరవ వేతనాలు పొందుతున్న వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. నమ్మాల్సిందే.. నమ్మి తీరాల్సిందే. లేకపోతే, పాలకులకు కోపమొస్తుంది. ప్రభుత్వ పెద్దలు నంది అంటే నంది.. అని ఒప్పుకోవాల్సిందే.. కాదు,...

దసరా రేసు నుండి తప్పుకున్న ఎఫ్3

2019 సంక్రాంతికి వచ్చిన ఎఫ్2 బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు లీడ్ రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ...