తెలంగాణలో దశల వారిగా లాక్ డౌన్ ను సడలిస్తూ వచ్చారు. పరిస్థితులు చక్కబడటంతో పాటు కేసులు తగ్గడంతో పూర్తిగా లాక్ డౌన్ ను ఎత్తివేసే అవకాశం ఉందని అంటున్నారు. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ అవ్వబోతుంది. ఆ భేటీలో పలు అంశాలను చర్చించబోతున్నారు. అందులో భాగంగా లాక్ డౌన్ ను ఎత్తి వేసే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. లాక్ డౌన్ నిర్ణయంపై మంత్రుల నిర్ణయం తీసుకుని ఎత్తివేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
లాక్ డౌన్ ఎత్తివేస్తే మరి థియేటర్ల పరిస్థితి ఏంటీ అనేది ప్రస్తుతం ప్రశ్న. గత ఏడాది మాదిరిగా థియేటర్లు మొదట 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఓపెన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ విషయమై కూడా నేడు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సినిమా థియేటర్లు ఓపెన్ అయితే వెంటనే రిలీజ్ అయ్యేందుకు సినిమాలు చాలా ఉన్నాయి. కనుక థియేటర్ల విషయమై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
764686 433330I discovered your blog internet site on google and verify some of your early posts. Continue to sustain up the superb operate. I simply extra up your RSS feed to my MSN News Reader. Looking for forward to reading extra from you in a whilst! 390848
189122 685474hey, your internet internet site is exceptional. We do appreciate your work 844189