Switch to English

అబ్జర్వేషన్‌: ఓటీటీ దెబ్బకి థియేటర్స్ ఔట్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ఇకపై థియేటర్‌కి వెళ్ళి సినిమా చూసే అవకాశం వుండదా.? ఏమో, ఇప్పుడే ఓ క్లారిటీకి వచ్చేయలేంగానీ.. పరిస్థితులు మాత్రం కొంత అనుమానాస్పదంగానే కన్పిస్తున్నాయి. ‘కరోనా వైరస్‌ ఎక్కువ కాలం వుండదు.. ఒక్కసారి వ్యాక్సిన్‌ వచ్చిందంటే.. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేస్తుంది..’ అని కొందరు అభిప్రాయపడ్తున్నారు. కరోనా వైరస్‌ దెబ్బకి పూర్తిగా దెబ్బతిన్న రంగాల్లో సినిమా రంగాన్ని ప్రముఖంగా చెప్పుకోవాలి. సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.. సినిమాల షూటింగులు కూడా జరుగుతున్నాయి. కానీ, రిలీజ్‌ల మాటేమిటి.? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టం.

కొన్ని సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కీర్తి సురేష్‌ నటించిన ‘పెంగ్విన్‌’ని ఆల్రెడీ ఓటీటీలో చూసేశాం. మరికొన్ని సినిమాలూ అదే బాటలో పయనిస్తున్నాయి. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ సినిమా ‘లక్ష్మీబాంబ్‌’ ఓటీటీలో వచ్చేస్తోంది. తమిళ సినిమాలు, తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు.. ఇలా అన్నీ ఓటీటీ వైపే చూడాల్సి వస్తోంది. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీటీ వైపు వెళ్ళబోం..’ అని చెప్పిన కొందరు నిర్మాతలు, ఇప్పుడు ఓటీటీ బేరాల్లో నిమగ్నమవ్వాల్సిన పరిస్థితి. ఒక్కసారి ఓటీటీకి జనం అలవాటు పడితే, ఇక ఆ తర్వాత థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడాలన్న ఇంట్రెస్ట్‌ని ఏమాత్రం ఆడియన్స్‌ చూపించే అవకాశం వుండదన్నది ఓ సినీ ప్రముఖుడి విశ్లేషణ.

టాలీవుడ్‌లో బోల్డన్ని సినిమాల్ని నిర్మించిన స్టార్‌ ప్రొడ్యూసర్‌ ఒకరు, మారుతున్న పరిణామాల నేపథ్యంలో థియేటర్ల బిజినెస్‌ రెండేళ్ళలోనే పూర్తిగా నాశనమైపోవచ్చు.. అని ఓ ఇంటర్వ్యూలో కుండబద్దలుగొట్టేశారు. కరోనా కారణంగా ఆ పరిస్థితి ఇంకా ముందే రావొచ్చని ఆవేదన వ్యక్తం చేశారు ఆ సినీ ప్రముఖుడు. మరికొందరు సినీ ప్రముఖులదీ ఇదే వాదన. నిజానికి, సినీ పరిశ్రమ సంక్షోభంలో పడింది కరోనా కారణంగా మాత్రమే కాదు. కరోనా కంటే కొద్ది రోజుల ముందే టాలీవుడ్‌లో సినిమా బిజినెస్‌పై కొంత ఆందోళన నెలకొంది. అదిప్పుడు మరింత తీవ్రమైందంతే.

దర్శకుడు రావ్‌ుగోపాల్‌ వర్మ, చిన్న చిన్న సినిమాల్లాంటివి తీసేసి, ఓటీటీ (ఎటీటీ అని కూడా అంటున్నాడు) రిలీజ్‌లు చేసేస్తున్న విషయం విదితమే. లాక్‌డౌన్‌లో గట్టిగా వెనకేసున్నది బహుశా ఆర్జీవీ మాత్రమేనేమో టాలీవుడ్‌కి సంబంధించి. ఓటీటీ అనగానే బూతు.. అన్న భావన వుంది. అందులో నిజం లేకపోలేదు కూడా. ఆ బూతు సంగతి పక్కన పెడితే, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీకి ఇప్పుడు ఓటీటీ ఓ అద్భుతమైన అవకాశంగా మారింది. ఓటీటీ పట్ల ఆడియన్స్‌ కూడా ఎడిక్ట్‌ అయిపోతున్న దరిమిలా.. థియేటర్‌ కల్చర్‌ అతి త్వరలోనే ‘తెరమరుగు’ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...