రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో వచ్చిన సినిమా ది వారియర్. ప్రోమోలు, సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.
కథ:
హైదరాబాద్ కు చెందిన డాక్టర్ సత్య (రామ్) కర్నూల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా చేరతాడు. అయితే కర్నూల్ లో గురు (ఆది పినిశెట్టి) చేస్తున్న ఆగడాలను చూసి రెస్పాండ్ అవుతాడు. అయితే సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లెమ్ కారణంగా వైద్యుడి కంటే పోలీస్ అయితేనే గురు ఆట కట్టించవచ్చని పోలీస్ అవుతాడు. రెండేళ్ల తర్వాత మళ్ళీ కర్నూల్ కే వస్తాడు.
ఈసారి పరిస్థితులు ఎలా మారాయి? సత్య, గురు ఆట కట్టించాడా లేదా?
నటీనటులు:
రామ్ రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ గా పెర్ఫెక్ట్ ఫిట్ లా అనిపించాడు. ఈ పాత్ర కోసం తనను తాను మలుచుకున్న విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పోలీస్ రోల్ లో రామ్ మ్యానరిజమ్స్ కానీ స్టైలింగ్ కానీ అదిరాయి. డాక్టర్ గానూ ఓకే అనిపించాడు. ఫైట్స్, డ్యాన్స్ లు ఇలా అన్నిట్లో రాణించాడు.
కథ పరంగా పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా కృతి శెట్టి ఉన్నంతలో ఆకట్టుకుంది. తెర మీద క్యూట్ గా కనిపించిన కృతి శెట్టి, రామ్ తో కెమిస్ట్రీని బాగా పండించింది. కనిపించిన రెండు సాంగ్స్ లో కూడా ఎనర్జిటిక్ గా చేసింది.
ఇక సినిమాలో రామ్ తర్వాత మెయిన్ హైలైట్ గా అనిపించేది ఆది పినిశెట్టి పాత్ర. గురు పాత్రలో ఆది రఫ్ఫాడించాడు. తన లుక్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగున్నాయి. ఇక సపోర్టింగ్ రోల్స్ లో బ్రహ్మాజీ, నదియా, అక్షర గౌడ రాణించారు.
సాంకేతిక నిపుణులు:
దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. సాంగ్స్ అన్నీ కూడా ఎనర్జిటిక్ గా సాగాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా కూడా దేవి మంచి ఔట్పుట్ ఇచ్చాడు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ వర్క్ సూపర్బ్ గా ఉంది. ఈ సినిమాలోని రస్టిక్ ఫ్లేవర్ ను సరిగ్గా అందుకున్నాడు. నవీన్ నూలి ఎడిటింగ్ కు పేరు పెట్టడానికి లేదు. ప్రొడక్షన్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇక లింగుసామి, కథ పరంగా కొంచెం కొత్తగా ట్రై చేసినా కానీ స్క్రీన్ ప్లే విషయంలో రొటీన్ రూట్ తీసుకోవడం కొంచెం నిరుత్సాహపరుస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఏం జరుగుతుంది అన్నది తెలిసిపోయాక పెద్దగా ఆసక్తి రాదు.
పాజిటివ్ పాయింట్స్:
* రామ్, ఆది పినిశెట్టి
* సెకండ్ హాఫ్ లో ఆది, రామ్ ల ఫేస్ ఆఫ్ సన్నివేశాలు
* సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు పాటలు
నెగటివ్ పాయింట్స్:
* రెగ్యులర్ టెంప్లేట్
* గ్రిప్పింగ్ నరేషన్ లేకపోవడం
విశ్లేషణ:
ఫస్ట్ హాఫ్ అంతా సో సో సాగిపోయిన వారియర్, సెకండ్ హాఫ్ పై ఆశలు పెంచుతుంది. అయితే అక్కడంతా రొటీన్ వ్యవహారమే నడుస్తుంది. ఇక ఒక వర్గం ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. అయితే రామ్, ఆది పినిశెట్టిలు ఉన్నంత సేపూ సినిమా గ్రాఫ్ ఎక్కడా డౌన్ కాకపోవడం విశేషం. మొత్తంగా చూసుకుంటే వారియర్ ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5