సమంత అంటే సౌత్ ఇండియాలో పరిచయం అవసరం లేని పేరు. ఆమెకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి సమంత నుంచి ఓ సినిమా అప్ డేట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. అయితే ఆమె ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆమె నటించిన సిటాడెల్ సిరీస్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. వరుణ్ ధావన్, సమంత కలిసి ఇందులో నటించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను తీసిన రాజ్, డీకే దీనికి దర్శకత్వం వహించారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ఈ సిరీస్ లో నటించింది.
కాగా ఇప్పుడు సిటాడెల్ ఇండియన్ సిరీస్ గా దాన్ని ఇక్కడ రీమేక్ చేశారు. ఈ ఇండియన్ సిరీస్ లో సమంత స్టన్నింగ్ యాక్షన్ సీన్లతో అదరగొట్టింది. కొద్ది సేపటి క్రితమే వచ్చిన ట్రైలర్ చూస్తే చాల రిచ్ గా కనిపిస్తోంది. సమంత ఇంతకు ముందు ఇలాంటి యాక్షన్ సీన్లలో కనిపించలేదు. ఇందులో ఇంత టైమింగ్ తో యాక్షన్ సీన్లు చేసిందంటే.. ఆమె కష్టం ఎంతగా ఉందో అర్థం అవుతోంది. బన్నీ, హనీ చుట్టూ ఈ కథాంశం ఉండబోతున్నట్టు ట్రైలర్ లో క్లారిటీ ఇచ్చేశారు. ఈ సిరీస్ ను పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
సిటాడెల్ నవంబర్ 7న పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ లో కొన్ని ఫన్నీ ట్రాక్ లతో పాటు అబ్బురపరిచే విజువల్స్, వాహ్ అనిపించే యాక్షన్ సీన్లు ఉన్నాయి. మరి సిరీస్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.