రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.183 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ జర్నీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా మూడో రోజు కలెక్షన్లు రెండో రోజును మించిపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. హారర్ ఫాంటసీ జానర్‌లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా “రాజా సాబ్” నిలిచిందని మేకర్స్ వెల్లడించారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించే ప్రయత్నంతో ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి రూపొందించినట్లు తెలిపారు. కథనం, విజువల్స్, హారర్ ఫాంటసీ అంశాలు కలగలిసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయని మేకర్స్ పేర్కొన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించారని తెలిపారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తమ నటనతో పాటు గ్లామర్‌తో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారని పేర్కొన్నారు.
సంక్రాంతి హాలిడే సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో తొలి వారం “రాజా సాబ్” మరిన్ని భారీ రికార్డులు నమోదు చేస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు. థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు, ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుదీర్ఘ విజయయాత్ర కొనసాగిస్తుందనే అంచనాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు.
