Switch to English

“పార్టీ శాశ్వతం… కార్యకర్తలే శక్తి!” – పాలకొండలో లోకేష్ సందేశం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

పాలకొండలో నిర్వహించిన టిడిపి కార్యకర్తల సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చే సందేశం ఇచ్చారు. తెలుగుదేశంలో వ్యక్తులు శాశ్వతం కాదని, పార్టీ మాత్రమే శాశ్వతమని ఆయన స్పష్టం చేశారు. భామిని ప్రాంతంలోని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన లోకేష్, తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా ముందుగా కార్యకర్తలను కలుసుకోవాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎన్నేళ్ల కష్టం, పసుపుజెండాను నిలబెట్టిన కేడర్ శ్రమతోనే ఈ స్థాయికి వచ్చామని అన్నారు.

2019–24 మధ్య జరిగిన సైకో పాలన గురించి గుర్తుచేసిన ఆయన, గేట్లు మూసి పెట్టి ప్రజలను భయపెట్టిన రోజులు గుర్తు చేశారు. తనపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసులు, పాదయాత్రను అడ్డుకునేందుకు తీసుకొచ్చిన జిఓ 1 కూడా తన ఒత్తిడిని తగ్గించలేదని చెప్పారు. అంజిరెడ్డి తాత నామినేషన్ అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు, పల్నాడులో మంజులపై జరిగిన దాడులు, బూత్‌ల వద్ద వైసిపి రిగ్గింగ్‌ను అడ్డుకున్న కేడర్ ధైర్యాన్ని ఉదాహరణగా చూపిస్తూ, అలాంటి కరుడుగట్టిన కార్యకర్తలే తనకు ప్రేరణ అని ఆయన అన్నారు. పల్నాడులో తోట చంద్రయ్య ప్రాణాలు అర్పించిన సంఘటనను గుర్తుచేసి, 94% సీట్లు సాధించడం వెనుక ఉన్న చెమట, శ్రమను ఎవరూ మరవద్దని వ్యాఖ్యానించారు.

ఉత్తరాంధ్ర ఇప్పుడు బ్యాక్‌వర్డ్ రీజియన్ కాదని, ఏపికి బ్యాక్‌బోన్‌గా మారిందని లోకేష్ తెలిపారు. 18 నెలల్లోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్, గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి పెట్టుబడులు రావడం కూటమి ప్రభుత్వ కృషి ఫలితమని చెప్పారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం ఇవ్వడం వంటి హామీలను నిలబెట్టుకుంటున్నామని పేర్కొన్నారు.

ఉద్యోగులకు గతంలో జీతాలు సరిగా రానప్పుడు, ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా 4 వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని, వికలాంగులకు 6 వేల నుంచి పడకకు పరిమితులైన వారికి 15 వేల వరకు అందిస్తున్నామని చెప్పారు. మెగా డీఎస్సీని 150 రోజుల్లో పూర్తి చేయడం, కేసులు వేసినా వెనక్కి తగ్గకుండా పని చేయడం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యమని అన్నారు.

గతంలో జరిగిన అరాచకాలను ప్రజలు మరచిపోలేదని, డాక్టర్ సుధాకర్, అమర్నాథ్ గౌడ్ వంటి బాధితుల ఉదాహరణలను ప్రస్తావించారు. ట్రైబల్ ప్రాంతాల అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నామని తెలిపారు. చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పడం కార్యకర్తల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే జోన్, అనేక సంక్షేమ చర్యలను గుర్తుచేశారు.

పార్టీలో చిన్నపాటి అసంతృప్తులకు ఇంట్లో పడుకోవద్దని, మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని లోకేష్ సూచించారు. జగన్ విలేకరుల సమావేశంలో రూ.50 కోట్లు దొంగతనం చిన్న విషయం అంటూ మాట్లాడటం అంగీకారయోగ్యం కాదని విమర్శించారు. వైసిపిలో కార్యకర్తలకు గౌరవం లేదని, అందుకే ప్రజలు తిరస్కరించారని అన్నారు.

టిడిపి కార్యకర్తలు ఆఫీసులకు వెళితే గౌరవంగా చూడాల్సిందేనని, ప్రతి పనికి లోకేష్ లేదా ఎమ్మెల్యే ఫోన్ చేయాల్సిన అవసరం లేదని, చట్టప్రకారం అధికారులు స్పందించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. గ్రూపు రాజకీయాలకు పూర్తిస్థాయి బ్రేక్ పెట్టాలని సూచించారు. పార్టీ నాయకుడు ఒక్కరే—చంద్రబాబు—అందరం ఆయన సైనికులమని అన్నారు. మై టిడిపి యాప్ ద్వారా కేడర్‌కు బాధ్యతలు ఇస్తున్నామని, టెక్నాలజీతో పార్టీని మరింత బలపరుస్తున్నామని చెప్పారు. పార్టీ వ్యవస్థ, కార్యకర్తలే పార్టీ బలం అని పునరుద్ఘాటించారు.

దామచర్ల సత్య, కిడారి శ్రావణ్ కుమార్, పడాల భూదేవి తదితరులు సమావేశంలో మాట్లాడి, లోకేష్ నాయకత్వాన్ని, కార్యకర్తలపట్ల ఆయన చూపుతున్న అంకితభావాన్ని ప్రశంసించారు. 2029లో కూడా కూటమి ప్రభుత్వం రావడానికి కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని కోరారు. సభలో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

సినిమా

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి,...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర...

రాజకీయం

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు...

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

ఎక్కువ చదివినవి

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్ బాబు పేరును స్మరించుకుంటూ ఆయన అభిమానులు...

Daily Horoscope: కార్యసిద్ధి యోగం, ఆర్థిక లాభ సూచనలు: నేటి రాశిఫలాలు

జనవరి 13, 2026 మంగళవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. పనుల్లో వేగం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా చిన్న లాభాలు అందుతాయి....

పిఠాపురం సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ చొరవతో సంస్కృతి పునరుజ్జీవనం

పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఈసారి సాధారణ పండుగ సంబరాలకు మించి, లోతైన సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాయి. ఈ వేడుకల వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి స్పష్టంగా కనిపించిందన్న...