మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో పప్పు బాలాజీ రెడ్డి నిర్మించిన, తోట శ్రీకాంత్ కుమార్ రచన-దర్శకత్వంలో రూపొందిన “థాంక్యూ డియర్” చిత్రం ఆగస్టు 1న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా, “తంత్ర” మూవీ ఫేమ్ ధనుష్ రఘుముద్రి హీరోగా, రేఖ నిరోషా మరో ముఖ్య పాత్రలో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు వరల్డ్ బర్నింగ్ ఇష్యూను చూపించారు.
ఈ సినిమా విడుదలకు ముందే హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ 50వ వార్షికోత్సవంలో ప్రత్యేక ప్రదర్శన జరగడమే కాక, 15వ గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడిగా తోట శ్రీకాంత్ అవార్డు అందుకున్నారు. హెబ్బా పటేల్ ఉత్తమ నటి అవార్డు, నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి డెబ్యూ ప్రొడ్యూసర్ అవార్డు, నాగ మహేష్ మరియు రేఖ నిరోషా సహాయ నటీనటుల అవార్డులు గెలుచుకున్నారు. అలాగే బెంగళూరు ఇండియా ఆర్ట్ అండ్ లిటరేచర్ అసోసియేషన్, వెస్ట్ బెంగాల్ వెల్రెడ్ అసోసియేషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించాయి. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.
ఈ చిత్రంలో రవి ప్రకాశ్, నాగ మహేష్, వీర శంకర్, ఛత్రపతి శేఖర్, మీనాకుమారి, బేబీ ప్రభావతి, బలగం సుజాత, సంక్రాంతి శ్రీనివాస్ నాయుడు, వీనిషా, వర్దిని, పప్పు చందు తదితరులు నటించగా, పిఎల్కే రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. సంగీతం సుభాష్ ఆనంద్ అందించారు.
ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో దర్శకుడు శ్రీకాంత్ తోట మాట్లాడుతూ, “మీడియా వారు మొదటి నుండి ఇచ్చిన సపోర్ట్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా ప్రపంచంలో జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్ ఆధారంగా కుటుంబం మొత్తం చూసేలా రూపొందించాం. ఇప్పటికే సినిమాకు వచ్చిన అవార్డులు మా బృందానికి గర్వకారణం. నిర్మాత బాలాజీ గారు ఇచ్చిన సహాయం మరువలేనిది” అన్నారు.
నిర్మాత బాలాజీ మాట్లాడుతూ, “ఆగస్టు 1న విడుదల కాబోతున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. మా టీమ్ అందరూ అద్భుతంగా పని చేశారు” అని తెలిపారు.
హీరో ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ, “నా తొలి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు. హెబ్బా పటేల్, రేఖ నిరోషా గార్లతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకుల మద్దతు మాకు తప్పక లభిస్తుంది” అన్నారు.
హీరోయిన్ రేఖ నిరోషా మాట్లాడుతూ, “ఈ సినిమా నా కెరీర్‌లో ప్రత్యేకమైనది. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పారు.
లైన్ ప్రొడ్యూసర్ పునీత్ మాట్లాడుతూ, “మా చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.
సంగీత దర్శకుడు సుభాష్ మాట్లాడుతూ, “డైరెక్టర్ శ్రీకాంత్, నిర్మాత బాలాజీ గారు ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే మేము మంచి మ్యూజిక్ అందించగలిగాము” అని అన్నారు.
“థాంక్యూ డియర్” ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

