మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ‘థాంక్యూ డియర్’ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ లాంచ్ చేశారు. పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా, తోట శ్రీకాంత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత, సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ – “రియల్ స్టార్ శ్రీహరి గారి కుటుంబం నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రి హీరోగా వస్తున్నాడు. అతని భవిష్యత్తు మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. బాలాజీ గారు నిర్మాతగా, శ్రీకాంత్ తోట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను” అన్నారు.
హీరో ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ – “మా టీజర్‌ను డైనమిక్ డైరెక్టర్ వినాయక్ గారు విడుదల చేయడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు” అని తెలిపారు.
హీరోయిన్ రేఖా నిరోషా స్పందిస్తూ – “వివి వినాయక్ గారు మా టీజర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరూ మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతాన్ని సుభాష్ ఆనంద్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని పి.ఎల్.కే రెడ్డి అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ‘థాంక్యూ డియర్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
