నాగ చైతన్య సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ కాగా ట్రైలర్ కూడా అంచనాలు పెంచేసింది. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ మూవీగా చెప్పుకుంటున్న తండేల్ బిజినెస్ విషయంలో కూడా అదరగొట్టేసింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించారు.
తండేల్ సినిమా నాన్ థియేట్రిక బిజినెస్ ఇప్పటి వరకు నాగ చైతన్య కెరీర్ లో ది బెస్ట్ అని తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ 35 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఆడియో రైట్స్ రూపంలో 7 కోట్ల దాకా వచ్చాయని తెలుస్తుంది. తెలుగు సినిమాలకు హిందీలో మార్కెట్ ఎక్కువగా ఉంది. అందుకే తండేల్ హిందీ రైట్స్ కోసం 8 కోట్ల దాకా ఛార్జ్ చేసినట్టు సమాచారం.
ఇవే కాకుండా శాటిలైట్స్ రూపంలో కూడా తండేల్ సినిమాకు మరో 10 కోట్లు వచ్చినట్టు చెబుతున్నారు. మొత్తంగా 60 కోట్ల దాకా నాన్ థియేట్రికల్ రైట్స్ తో తండేల్ అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ చేసింది. తండేల్ సినిమా 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని తెలుస్తుంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే 60 కోట్లు తీసుకురాగా మిగిలిన 30 కోట్లు థియేట్రికల్ బిజినెస్ తో రాబట్టాల్సి ఉంటుంది. సినిమాకు ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. తండేల్ సినిమాకు ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా నాగ చైతన్య ఖాతాలో సరికొత్త రికార్డులు వచ్చి చేరేలా ఉన్నాయి.