నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది తండేల్. ఇప్పటి వరకు అక్కినేని హీరోలు వంద కోట్ల క్లబ్ ను చవిచూడలేదు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా వంద కోట్లు వసూలు చేస్తామని ముందు నుంచే మూవీ టీమ్ చెబుతోంది. పైగా అల్లు అరవింద్, బన్నీ వాసు లాంటి వారు వెనకుండి నడిపిస్తున్నారు. సాయిపల్లవితో మరింత హైప్ క్రియేట్ అయింది. పోస్టర్లు, టీజర్లు భారీ బజ్ ను క్రియేట్ చేశాయి. ఇంత జరిగిన తర్వాత సంక్రాంతికి మూవీ వస్తుందని అంతా ఆశించారు. సంక్రాంతి లాంటి పెద్ద సీజన్ లో అయితేనే మూవీకి వసూళ్లు బాగా పెరుగుతాయని అనుకున్నారు.
కానీ సడెన్ గా సంక్రాంతి నుంచి పోస్టుపోన్ చేశారు. మూవీని ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. దాంతో అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ ఈ రిలీజ్ డేట్ మీద అంసతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో పూర్తిగా ఎగ్జామ్స్ ఉంటాయి. టీనేజ్ స్టూడెంట్ల దగ్గరి నుంచి గ్రాడ్యుయేట్ల దాకా అందరూ ఎగ్జామ్స్ బిజీలోనే ఉంటారు. కాబట్టి అది మూవీకి అన్ సీజన్. పైగా బడ్జెట్ 80 కోట్లు దాటిందంటున్నారు. వంద కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. అది సాధించడం అంటే సంక్రాంతి లాంటి పెద్ద సీజన్ లోనే సాధ్యం అనేది అక్కినేని ఫ్యాన్స్ వాదన.
కానీ సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకీ సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య మూవీ పోటీలో ఉన్నాయి. కాబట్టి అప్పుడు రిలీజ్ చేస్తే థియేటర్లు దొరకవని.. అనుకున్న రేంజ్ లో వసూళ్లు రావని.. ఫిబ్రవరిలో అయితే ఏ సినిమాలు లేవు కాబట్టి అన్ని థియేటర్లలో మూవీని రిలీజ్ చేయొచ్చని అల్లు అరవింద్ భావిస్తున్నారంట. మరి ఫ్యాన్స్ అసంతృప్తిని మూవీ తీరుస్తుందా లేదా అనేది చూడాలి.