Thandel: నాగచైతన్య-సాయిపల్లవి జంటగా తెరకెక్కిన సినిమా ‘తండేల్’. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో చందూ మెండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 2025 ఫిబ్రవరి 7న సినిమా విడుదలవుతోందని చిత్ర బృందం ప్రకటించింది. సినిమా విశేషాలు చెప్తూ..
‘మత్స్యకారుల సమస్యలపై తెరకెక్కిన సినిమా. ఇందుకు నాగచైతన్య శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారుల వ్యవహారశైలిని అధ్యయనం చేసారు. ఏడాదిన్నరగా ఈ సినిమా కోసమే సమయం కేటాయించారు. తండేల్ అంటే లీడర్ అని అర్ధం. టైటిల్ పై మరోసారి వివరిస్తాం. మత్స్యకారుల సమస్యలే కాకుండా మంచి ప్రేమకథ ఉన్న సినిమా’.
‘ఎటువంటి పోటీ లేకుండా రావాలనే సంక్రాంతికి కాకుండా ఫిబ్రవరిలో వ్యాలెంటైన్ డేకు ముందు వస్తున్నాం. తెలుగు, తమిళ హిందీ భాషల్లోనే కాకుండా కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేస్తాం. సినిమాలో నాగచైతన్య-సాయిపల్లవి నటనకు జాతీయ అవార్డులు వస్తాయని భావిస్తున్నాం. సినిమా 100కోట్ల వసూళ్లు సాధిస్తుందనే నమ్మకముంద’ని అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.