శుక్రవారం రిలీజ్ కాబోతున్న తండేల్ సినిమా ప్రీ రిలీజ్ హంగామా ఒక రేంజ్ లో ఉంది. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రాన్ని చందు మొండేటి డైరెక్ట్ చేశారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మించారు. గీతా ఆర్ట్స్ 2 ప్రొడక్షన్ లోనే కాదు నాగ చైతన్య కెరీర్ లో కూడా ఇది హైయ్యెస్ట్ బడ్జెట్ మూవీ అని తెలుస్తుంది.
తండేల్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు సూపర్ బజ్ తెచ్చింది. సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా బుజ్జి తలి సాంగ్, హైలెస్సో సాంగ్ అయితే యూత్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. ఐతే సినిమా శుక్రవారం రిలీజ్ ఉంది అనగా దేవి శ్రీ ప్రసాద్ రికార్డింగ్ స్టూడియోలో డైరెక్టర్ చందు మొండేటి, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఇద్దరు తండేల్ సాంగ్ కు డ్యాన్స్ వేశారు.
సినిమా చూసి చాలా సంతృప్తిగా ఉన్నట్టు అనిపిస్తున్న వీరు ఆ సంతోషంలో డ్యాన్స్ కూడా వేశారు. ఇక గీతా ఆర్ట్స్ 2 ట్విట్టర్ పేజ్ లో ఈ వీడియో షేర్ చేసి వస్తున్నాం దుల్లకొడుతున్నాం అని రాసుకొచ్చారు. తండేల్ సినిమా అన్ని విధాలుగా భారీ హైప్ తెచ్చుకోగా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది అంటే మాత్రం నాగ చైతన్య కెరీర్ లో భారీ హిట్ దక్కినట్టే లెక్క. మరి సినిమా ఫలితం ఏంటి అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.