Thammudu: నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రల్లో నటించారు. జూలై 4న విడుదలకు సిద్ధమవుతోన్న మూవీ ట్రైలర్ హైదరాబాద్ లో రిలీజ్ చేసింది టీమ్. కార్యక్రమంలో నటీనటులు మాట్లాడుతూ..
నితిన్.. ‘సినిమా కోసం దర్శకుడు వేణు నాలుగేళ్లు కష్టపడ్డారు. ఆ కష్టం వృధాపోదు. ట్రైలర్ లానే సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ఎక్కువ భాగం అడవుల్లోనే చిత్రీకరించాం. నా కెరీర్ ప్రారంభంలోనే దిల్ రాజు ఎక్కవ ఖర్చు చేశారు. ఇప్పుడు నా కెరీర్ హయ్యస్ట్ ఖర్చు పెట్టారు. దిల్ మాదిరిగానే తమ్ముడు విజయం సాధిస్తుందనే నమ్మకముంది. లయ, సప్తమీ గౌడ, స్వసిక అద్భుతంగా నటించారు. టెక్నీషియన్స్ అందరూ మంచి ఔట్ పుట్ ఇచ్చార’ని అన్నారు.
దిల్ రాజు.. ‘తమ్ముడు’ కోసం శ్రీరామ్ వేణు నాలుగేళ్లు కష్టపడ్డాడు. సినిమా కోసం విజువల్, సౌండ్ కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తానని చెప్పినట్టుగానే కష్టపడి చేశాడు. అక్కా-తమ్ముడి మధ్య జరిగే కథే అయినా.. కొత్త కాన్సెప్ట్. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తున్నట్టే థియేటర్లోనూ మంచి రెస్పాన్స్ వస్తుందని ఈ జానర్లో ‘తమ్ముడు’ రిఫరెన్స్ అవుతుందని నమ్ముతున్నాం. అక్క పాత్రలో లయ, ముఖ్యమైన పాత్రలో సప్తమి గౌడ నటించారు. ప్రేక్షకులకు సినిమా తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం. థియేట్రికల్ గా ఎంజాయ్ చేయాల్సిన సినిమా తమ్ముడు. కథ, క్వాలిటీ మేకింగ్ తెలిసి నిర్మాత పరిస్థితి అర్ధం చేసుకుని నితిన్ ఎంతో సహకరించారు. ‘నితిన్’కు తమ్ముడు చాలా ఇంపార్టెంట్. మేము ఎగ్జామ్ రాశాం. జూలై 4న రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా’మని అన్నారు.
శ్రీరామ్ వేణు.. ‘తమ్ముడు’ పక్కా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీ. కొత్త స్క్రీన్ ప్లే చూస్తారు. ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా ఉంది. కథను కొందరు హీరోలు రిజెక్ట్ చేసినా నితిన్ కథలో ఎమోషన్ అర్థం చేసుకుని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమా కోసం ఆలోచించే హీరో నితిన్. పవన్ గారి తర్వాత అలాంటి క్వాలిటీ నితిన్ లో చూశాను. ‘తమ్ముడు’ సాధించబోయే సక్సెస్ క్రెడిట్ టీమ్ కే ఇస్తాను. ఐకాన్ కథ వేరు, ఇది వేరు. నేను, నితిన్, రాజుగారు పవన్ గారి ఫ్యాన్స్. ఆయన అభిమానులుగానే సినిమాకి ‘తమ్ముడు’ టైటిల్ పెట్టుకున్నా’మని అన్నారు.
లయ.. సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న 20ఏళ్లకు దిల్ రాజు గారి బ్యానర్లో ‘తమ్ముడు’తో రీ-ఎంట్రీ ఇవ్వడం సొంతింటికి తిరిగొచ్చినట్టే ఉంది. నాలోని భయాలు, సందేహాలను టీమ్ నాలో పొగోట్టింది. దర్శకుడు నాతో 2 రోజులు ఫొటో షూట్ చేయించి మరీ తీసుకున్నారు. నిజంగా తమ్ముడిలా అనిపించిన నితిన్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ‘తమ్ముడు’ తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకముంద’ని అన్నారు.
సప్తమి గౌడ.. ‘తమ్ముడు’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయమవడం సంతోషంగా ఉంది. మూవీలో రత్న పాత్రలో నటించాను. నితిన్, లయ, వర్ష, స్వసికతో నాకు ఎక్కువగా సీన్స్ ఉండవు. ఎందుకనేది మూవీలో చూడాల్సిందే. డానీ ఒక క్యారెక్టర్ నాతో పాటు ఉంటుంది. మూవీ అందరికీ నచ్చుతుంద’ని అన్నారు.
