Thaman: సంక్రాంతి సందర్భంగా సోషల్ మీడియాలో తన సంగీత దర్శకత్వంలో రాబోయే సినిమాల అప్డేట్స్ పంచుకున్నారు తమన్. ప్రస్తుతం ఆయన పవన్ కల్యాణ్ ‘ఓజీ’, ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. రెండు సినిమాలపై అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘ఓజీ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయనేది నిజం. అందుకు తగ్గట్టే సినిమా ఉండబోతోంది. గ్యాంగస్టర్ సినిమాల్లో ఇదో కొత్త తరహా యాక్షన్ సినిమాగా నిలుస్తుంది. సంగీతంపరంగా కూడా 40 సౌండ్ ట్రాక్స్ ఉన్నాయి. తెలుగులో ఇటువంటి సౌండ్ ట్రాక్స్ లేవు. 7పాటలు ఉండగా.. 4పాటలు పూర్తయ్యాయి. త్వరలోనే మిగిలిన పాటలు పూర్తి చేస్తాం’.
‘ప్రభాస్ రాజాసాబ్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. భారీ మాస్ ఆల్బమ్ సినిమాలో ఉండబోతోంది. 5పాటలకు 3పాటల వర్క్ పూర్తయింది. త్వరలో బ్యాలెన్స్ 2పాటల పని పూర్తి చేస్తాం. హీరో ఇంట్రడక్షన్ సాంగ్, ఐటమ్ సాంగ్, ముగ్గురమ్మాయిలతో పాట ఉంటాయి. సినిమా అందరికీ నచ్చుతుంద’ని అన్నారు.