Switch to English

గుడ్ న్యూస్: పోస్ట్ ప్రొడక్షన్ కి గ్రీన్ సిగ్నల్, షూటింగ్స్ పై త్వరలోనే నిర్ణయం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ ప్రముఖులకు హామీ ఇచ్చారు.

గురువారం జూబ్లీహిల్స్ లోని ప్రముఖ సినీనటులు, పద్మభూషణ్ చిరంజీవి నివాసంలో చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తానని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సమావేశంలో పలువురు నిర్మాతలు, దర్శకులు మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాది మంది ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

అందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే షూటింగ్ లను నిలిపివేయడం జరిగిందని అన్నారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమలోని 14 వేల మందికి కరోనా క్రైసిస్ చారిటీ (CCC) ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పరిశ్రమలోని అన్ని వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని సినీమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకునేందుకు, సినిమా దియేటర్ లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు. లాక్ డౌన్ సమయంలో షూటింగ్ లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో వివరిస్తూ అవుట్ డోర్, ఇండోర్ షూటింగ్ లకు సంబంధించిన మాక్ వీడియో ను ప్రభుత్వానికి సమర్పిస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు.

స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల ఎప్పుడు సానుకూడా ధోరణితో ఉంటుందని చెప్పారు. దేశంలోనే హైదరాబాద్ నగరం చిత్రరంగానికి హబ్ గా నిలిచిందని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు అనుమతించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. తప్పని సరిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్క్ లను ధరించాలని, శానిటైజేషన్ ఉపయోగించాలని, బౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మాక్ షూటింగ్ నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. షూటింగ్ ల నిర్వహణకు, దియేటర్ లను తెరిచేందుకు ముఖ్యమంత్రి తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో పద్మభూషణ్ చిరంజీవి, సేనియర్ నటులు అక్కినేని నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, C.కళ్యాణ్, దిల్ రాజు, శ్యాం ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, దర్శకులు VV,వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, N.శంకర్, FDC మాజీ చైర్మన్ రాం మోహన్ రావు

4 COMMENTS

  1. 169096 374406Youre so cool! I dont suppose Ive learn anything like this before. So good to uncover any person with some authentic thoughts on this topic. realy thank you for starting this up. this internet site is something that is wanted on the internet, someone with slightly bit originality. helpful job for bringing something new towards the internet! 245080

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

రాజకీయం

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...