Switch to English

క్రైమ్ న్యూస్: 5 నెలల గర్బిని భార్యను హత్య చేసిన భర్త, ఎందుకో తెలుసా?

5 నెలల గర్బిని భార్యను హత్య చేసిన భర్త, ఎందుకో తెలుసా?

దిల్లీలోని అంబేద్కర్‌ నగర్‌లో దారుణం జరిగింది. చెప్పా పెట్టకుండా బయటకు వెళ్లినందుకు గాను తన భార్యను విచక్షణ కోల్పోయి చంపేశాడు ఒక భర్త. తన భార్యను చంపేశాను అంటూ నేరుగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన అతడిని ప్రశ్నించిన పోలీసులు అతడు చెప్పిన సమాధానం విని ఆశ్చర్య పోయారు. అతడి వాలకం చూస్తే హత్య చేసినట్లుగానే లేడంటూ పోలీసులు అంటున్నారు.

పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. విజయ్‌ అనే వ్యక్తి తన 30 ఏళ్ల భార్య హేమలతతో గొడవ పడ్డాడు. 5 నెలల గర్బవతి అయిన హేమలత నిన్న సాయంత్రం సమయంలో విజయ్‌ సోదరి ఇంటికి వెళ్లింది. పక్కనే ఉండటంతో వెంటనే రావచ్చు అనుకుంది. కాని అక్కడ ఆలస్యం అయ్యింది. బయట నుండి ఇంటికి వచ్చేప్పటికి ఇంట్లో భార్య లేకపోవడంతో అతడికి కోపం వచ్చింది.

ఆమె వచ్చే వరకు వెయిట్‌ చేసి గొడవ పడ్డాడు. ఆమె కూడా అతడితో గొడవకు దిగడంతో ఇద్దరి మద్య గొడవ మద్యరాత్రి వరకు సాగింది. తాగిన మైకంలో ఉన్న విజయ్‌ విచక్షణ కోల్పోయి హేమలతను చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు పంపించారు.

రూ.1200 గొడవ, హత్యకు దారితీసింది

రూ.1200 గొడవ – కౄరంగా పొడుచుకునే స్థాయికి వెళ్ళింది

లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పేదలు తీవ్రమైన ఆర్థిక పరిస్థితులతో అల్లాడుతున్నారు. కనీస అవసరాలకు సంబంధించిన పదార్థాలు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో డబ్బుల కోసం గొడవలకు దిగడం, హత్యలు చేయడం వంటివి కూడా చేస్తున్నారు. తాజగా హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట ప్రాంతంలో ముగ్గురు స్నేహితులపై ఒక వ్యక్తి కేవలం రూ.1200 కోసం కత్తితో పొడిచి అక్కడ నుండి పారిపోయాడు.

ముగ్గురు స్నేహితులు మెడికల్‌ షాప్‌ వద్ద రూ. 1200 విషయమై గొడవ పడ్డారు. ఆ సమయంలో వారిని వారించేందుకు మరో స్నేహితుడు అక్కడకు వచ్చాడు. డబ్బుల విషయంలో గొడవ తీవ్రం అవ్వడంతో మోహసీన్‌ అనే వ్యక్తి ముగ్గురు స్నేహితులపై కత్తితో దాడి చేశాడు. దాంతో వారు తీవ్రమైన రక్తస్రావంతో యశోదా హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు. ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందంటూ వైధ్యులు ప్రకటించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి మోహసీన్‌ను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: ఏపీలో విమానం దిగాలంటే ఈ కండీషన్స్‌ తప్పనిసరి

నిన్నటి నుండి దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఏపీలో విమానాలు మొదలు కాలేదు. ఏపీకి రావాలంటే కొన్ని కండీషన్స్‌ ను పెడుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య...

ప్రభాస్ – పూరి.. జరిగే పనేనా?

దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఫ్యాన్స్ విషయంలో కొదవ లేదు. ప్రతీ స్టార్ హీరో అభిమాని పూరిని కూడా అభిమానిస్తాడు. తమ హీరోకు పూరి ప్లాప్ ఇచ్చినా సరే మరోసారి తనతో కలిసి...

కుమారుడి మృతితో సీనియర్ నటి వాణిశ్రీ ఇంట విషాదం.!

తమిళ, కన్నడ, మళయాళ భాషలలో అలనాటి స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన సీనియర్ నటి, కళాభినేత్రి వాణీశ్రీ ఇంట నేడు విషాదం చోటు చేసుకుంది. వాణీశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేష్ కార్తీక్...

క్రైమ్ న్యూస్: కుక్కపై కోపం అతని ప్రాణాలే తీసింది..

పక్కింటివారి పెంపుడు కుక్క తనను చూసి మొరిగిందని ఆగ్రహానికి గురయ్యాడో వ్యక్తి. ఆ కోపంలో తాను చేసిన పనికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. రాష్ట్రంలోని రోహ్తాస్...

వైఎస్‌ జగన్‌తో చిరంజీవి భేటీ.. అతి త్వరలో.!

మెగాస్టార్‌ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ కాబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి పలు కీలక అంశాలపై వైఎస్‌ జగన్‌తో చిరంజీవి ఈ బేటీలో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా...