Switch to English

తెలుగు సినీ ప్రముఖులకు జగన్ సర్కారు ఆహ్వానం వెనుక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ప్రభువులు ఆహ్వానం పంపారు.. ఆ ప్రభువుల పాలన కారణంగా బాధితులైనవారు, ‘మా కష్టాలు తీర్చండి మహాప్రభో..’ అంటూ విన్నపాలు చేసుకోవడానికి సిద్ధపడాల్సిందే. సినీ పరిశ్రమ.. అన్ని రంగాల్లానే, ఆదీ ఓ ముఖ్యమైన రంగమే. ప్రభుత్వాలకి బోల్డంత ఆదాయాన్ని పన్నుల రూపంలోనో, ఇతర రూపాల్లోనో అందిస్తోన్న రంగమిది. సినీ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వమ్మీదా వుంది.

ప్రపంచ సినిమాతో పోటీ పడే స్థాయికి తెలుగు సినీ పరిశ్రమ ఎదుగుతోందని అంతా భావిస్తోన్న తరుణంలో, కోలుకోలేని దెబ్బ తగిలింది తెలుగు సినీ పరిశ్రమకి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సినిమా టిక్కెట్ల ధరల్ని నియంత్రించాలని నిర్ణయం తీసుకోవడమే అందుక్కారణం. కేవలం ఓ వ్యక్తి మీద అక్కసు కారణంగా జగన్ సర్కార్, రాత్రికి రాత్రి సినిమా టిక్కెట్ల ధరల్ని తగ్గించింది. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్.. ఆ సినిమా ‘వకీల్ సాబ్’. అప్పటినుంచి ఇప్పటిదాకా, పెద్ద సినిమాలు భయపడాల్సిన పరిస్థితి.

కరోనా నేపథ్యంలో పెద్ద సినిమాల రిలీజులు వెనక్కి వెళ్ళిపోయాయ్. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ కోలుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సినీ పెద్దలకు పిలుపు వచ్చింది. సినీ పెద్దలు వెళతారు, చర్చలు జరుపుతారు. చిన్నపాటి సన్మానాలూ జరుగుతున్నాయి. ‘మీకు ఏం కావాలన్నా చెప్పండి చేసేస్తాం..’ అని ప్రభువులు భరోసా ఇచ్చేస్తారు. ఆ తర్వాత కథ మళ్ళీ మొదటికొస్తుంది.

దేశంలో ఎక్కడా లేని దారుణమిది.. టిక్కెట్ రేట్లను, తమకు నచ్చని వ్యక్తుల సినిమాల కోసం తగ్గించడమనేది. ఏ ప్రభుత్వమూ ఇలాంటి చర్యలకు దిగదు. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చిత్ర విచిత్రమైన పద్ధతుల్ని తీసుకొచ్చింది. ప్రభువులు పిలిచారు కాబట్టి, ‘జీ హుజూర్..’ అంటూ వెళ్ళి హాజరవుతారా తెలుగు సినీ ప్రముఖులు.? వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే, సినీ పరిశ్రమ అంటే అద్దాల మేడ. చిన్న రాయి తగిలినా, డ్యామేజీ దారుణంగా వుంటుంది.

పెట్రోల్ ధర 110 రూపాయలకు చేరుకుంది. సినిమా టిక్కెట్ మాత్రం తగ్గించేయాలి. పన్నులు పెరుగుతాయ్.. జనానికి వాత పడుతుంది. కానీ, సినిమా మాత్రం తక్కువ ఖర్చుతోనే చూసేందుకు వీలు కల్పించాలి. థియేటర్ల నిర్వహణ ఈ రోజుల్లో ఎంత దారుణంగా వుందో ప్రభుత్వంలో వున్నవారికి తెలియదా.? సమస్య చాలా చాలా పెద్దది. అది ప్రభుత్వ పెద్దలచే సృష్టించబడినది. దానికి ప్రభువులు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అయినను పోయి రావలె అమరావతికి.. ఇదీ సినీ పరిశ్రమ ప్రముఖుల ముందున్న ఓన్లీ ఆప్షన్.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...