Switch to English

తెలుగు హీరోలకి అరవ గడ్డపై అంత సీన్‌ లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,115FansLike
57,764FollowersFollow

మహేష్‌బాబు టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌. కానీ, తమిళనాడులో అంత సీన్‌ కన్పించడంలేదు. మహేష్‌ అనే కాదు, తెలుగు హీరోల్లో ఎవరికీ తమిళనాడులో అంత సీన్‌ వుండదు. కారణాలు వెతికితే చాలానే దొరుకుతాయి. తమిళ హీరోలు తెలుగులోనూ స్టార్లుగా సత్తా చాటేస్తారుగానీ.. మనోళ్ళకి మాత్రం అక్కడ అంత క్రేజ్‌ లభించదుగాక లభించదు.

తమిళ సినిమా మార్కెట్‌పై తెలుగు హీరోలు ఫోకస్‌ పెట్టలేదనడం కూడా సరికాదు. కానీ, అక్కడ మన సినిమాల్ని సరిగ్గా ఆదరించరు. అదే అసలు సమస్య. అన్నట్టు, మన తెలుగు హీరోయిన్లు మాత్రం తమిళనాడులో అవకాశాలు దక్కించుకుంటారు. ఆ మాటకొస్తే, తెలుగు సినిమాలతో కంటే తమిళ సినిమాలతో క్రేజ్‌ సంపాదించుకున్న హీరోయిన్లు ఎందరో కన్పిస్తారు. ఎందుకిలా.? ఇదేమీ మిలియన్‌ డాలర్ల ప్రశ్న కాదు. కానీ, సమస్యకు మాత్రం పరిష్కారం దొరకడంలేదు.

తెలుగు సినిమా తన స్థాయిని పాన్‌ ఇండియా రేంజ్‌కే కాదు, ఇంటర్నేషనల్‌ లెవల్‌కి పెంచుకుంది. సౌత్‌లో తెలుగు సినీ పరిశ్రమే అతి పెద్దది. ఆ తర్వాతి స్థానం తమిళ సినిమాదే. అయినాగానీ, తమిళ సినీ అభిమానులు, తెలుగు సినిమాల పట్ల ఆసక్తి చూపించరు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం ఏ స్థాయిలో తమిళనాట ప్రమోషన్స్‌ జరిగాయో చూశాం.

అంతకు ముందు ‘స్పైడర్‌’కీ అలాగే జరిగింది. ‘బాహుబలి’, ‘సాహో’ పరిస్థితి వేరు. తెలుగు నాట రజనీకాంత్‌ నుంచి కార్తీ వరకూ చాలామంది స్టార్‌డమ్‌ కొనసాగిస్తున్నారు. కానీ, అలా తెలుగు హీరోలు తమిళ నాట స్టార్లు అయ్యారా.? అంటే లేదాయె. ‘ఖైదీ’ సినిమాపై మహేష్‌ ప్రశంసలు గుప్పించాడు. రజనీకాంత్‌కి ఇక్కడ చాలామంది సినీ ప్రముఖులూ అభిమానులే. ఆ పరిస్థితి మన హీరోలకీ తమిళనాడులో వస్తే ఎంత బావుంటుందో కదా.!

12 COMMENTS

సినిమా

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ...

రాజకీయం

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

ఎక్కువ చదివినవి

80వ రోజు ప్రజాదర్బార్‌లో సమస్యల వెల్లువ… విశాఖ టీడీపీ కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు

విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 80వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. విశాఖ నగరం మాత్రమే కాకుండా పరిసర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు,...

Daily Horoscope: మిథునానికి ఉద్యోగంలో శుభవార్తలు, వృశ్చికానికి ఆర్థిక లాభ సూచనలు.

జనవరి 11, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈరోజు మేష రాశివారికి పనుల్లో వేగం పెరుగుతుంది. చంద్రబలం వల్ల నిర్ణయాలు సులభంగా తీసుకుంటారు. కుటుంబంలో చిన్న విషయాలపై చర్చలు రావచ్చు. ఖర్చుల విషయంలో...

Tollywood: డియర్ సెలబ్రిటీస్.. ప్రీ-రిలీజ్ స్టేజీలపై ఎందుకీ అతి?

Tollywood: ఓ సెలబ్రిటీ అత్యుత్సాహంతో మాట్లాడితే కామన్ మ్యాన్ సరదాగా తీసుకుంటాడు. కానీ, అదే కామన్ మ్యాన్ సెలబ్రిటీ అయితే లాజిక్ మర్చిపోతాడు. చుట్టూ జనం, అభిమానుల హోరు. ఏం మాట్లాడుతున్నాడో తెలీదు....

మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యలతో రాధాకృష్ణ వివాదం

టీవీ చర్చలు, కాలమ్స్‌లో సంచలన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ తాజాగా తన ‘కొత్తపలుకు’ కథనంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. ఇటీవల నటుడు...

తీర రక్షణకు గ్రీన్ షీల్డ్… జనవరి చివరికి రూట్‌మ్యాప్ సిద్ధం

తీర ప్రాంత అడవుల రక్షణ, ఆక్రమణల నిరోధానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...