Tollywood: తెలుగు సినీ నటీనటులకు ‘గద్దర్ అవార్డ్స్’ పేరుతో పురస్కారాలు ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వంతో సంప్రదించేలా ముందుకెళ్లాలని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పునరుద్ఘాటించారు. దీనిపై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. ఈమేరకు ఓ లేఖ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కొన్నేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న అవార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “గద్దర్ అవార్డ్స్” పేరు మీద ప్రతిఏటా అవార్డ్స్ ఇస్తామని గతంలో ప్రకటించడం హర్షణీయం. తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనిపై చర్చించాం’.
‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ కమిటీని నియమించి.. విధి విధానాలను తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి త్వరలో అందజేస్తామ’ అధ్యక్షులు భరత్ భూషణ్, కార్యదర్శులు దామోదర వరప్రసాద్, శివప్రసాదరావు లేఖ విడుదల చేశారు.