బిగ్ బాస్ భామ, తెలుగమ్మాయి దివి వద్య అందరికీ సుపరిచుతురాలే… తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్లు గా రాణించాలంటే అందం, అభినయం తో పాటుగా.. గ్లామర్ కూడా ప్రధానం అనేది ఆనవాయితీ గా కొనసాగుతోంది. ముంబయి నుంచి దిగుమతి అయిన గ్లామర్ డాల్ లనే ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆదరిస్తూ వచ్చారు.. ఈ కారణంగా.. నిర్మాతలు , హీరోలు కూడా తమ సినిమాల్లో పరభాషా భామలనే నటింప జేశారు అని చెప్పటం అతి శయోక్తి కాదు.. ఇప్పటి వరకూ తెలుగులో నటించిన తెలుగమ్మాయిల్లో చాలావరకూ అందం , అభినయం పుష్కలంగా ఉన్న వారు తెరపైకి వచ్చినా కూడా .. ఎందుకో తెలియదు గానీ గ్లామర్ పరంగానూ, కమర్షియల్ సక్సెస్ పరంగానూ .. ముంబయి భామలతో పోలిస్తే.. తెలుగమ్మాయిలు.. కాస్త వెనుక వరుసలో ఉన్నట్టుగానే అనిపిస్తారు. ఈ విషయం బాగా అవపోసన పట్టిన దివి… అభినయంతో పాటుగా గ్లామర్ తార గా కూడా ఎదగడానికి ఎంతగానో శ్రమిస్తూ , క్రమంగా మంచి మార్కులు సాధిస్తూ వస్తోంది. ఫిట్ నెస్, ఔట్ ఫిట్ విషయాల్లో రాజీ పడకుండా వర్కౌట్స్ చేస్తూ పలు సందర్భాల్లో అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేసుకుంటోంది..
తన అందం, అభినయం, ఆకర్షణ పెంచుకుంటూ.. ఇండస్ట్రీ లో అందరితో మంచిగా నడుచుకుంటూ, అడపా దడపా.. ఆకర్షించే ఫోటో షూట్ లను చేస్తూ… తనను తాను ప్రమోట్ చేసుకుంటోంది.. దివి ఆసక్తిని , గ్లామర్ తో కూడిన ఔట్ ఫిట్ ను గమనించిన నిర్మాతలు దివి కి వరుసగా మంచి అవకాశాలు ఇస్తున్నారు.
గతంలో బిగ్ బాస్ ఫైనల్స్ కి ముఖ్య అతిధి గా హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. దివి ని చూసి ముచ్చట పడి.. తన రెండు సినిమాల్లో అవకాశం ఇవ్వడం మనకు తెలిసిందే.. అయితే గాడ్ ఫాదర్.. రిలీజ్ అయ్యే వరకూ.. ఆ సినిమాలో తనకు వచ్చిన పాత్ర పట్ల.. దివి కొంత సందేహంగా, భయంగా ఉండింది… దానికి కారణం ఆ పాత్ర గ్లామర్ పరంగా లేదు.. కేవలం అభినయానికి సంబంధించినదే.. కానీ గాడ్ ఫాదర్ విడుదలై.. బ్లాక్ బస్టర్ విజయం సాధించాకా.. దివి అభినయానికి కూడా అంతే రీతిలో మార్కులు పడ్డాయి. మెగాస్టార్ కూడా ప్రశంసించారు.. దీనితో దివి గ్రాఫ్ బాగా పెరిగిందని చెప్పొచ్చు.
గతంలో కొన్ని చిన్న పాత్రలు, సైడ్ క్యారెక్టర్లు చేసినప్పటికీ.. గాడ్ ఫాదర్ లో తన అభినయం ఏమిటో చూపించిన మన తెలుగమ్మాయి దివి కి హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.. అభినయానికి గ్లామర్ ను జోడించే మెళకువలు దివి వద్ద ఉండనే ఉన్నాయి.
ఇప్పటికే సెలెబ్రిటీ హోదా ను సంపాదించుకున్న దివి శనివారం నాడు.. ప్రతిష్టాత్మక సంస్థ.. జోయలుక్కాస్ పంజాగుట్ట శాఖ గ్రాండ్ న్యూ ఓపెనింగ్ కి సెలెబ్రిటీ గెస్ట్ గా హాజరైంది కూడా.
కొత్త టాలెంట్ ను, లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందుండే తెలుగు బులెటిన్.. తెలుగమ్మాయి దివి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగి.. ఇతర భాషల్లో కూడా రాణిస్తుందని నమ్ముతూ .. దివి ఎదుగులను ఆకాంక్షిస్తోంది.