ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ‘తెలంగాణ దిష్టి’ వ్యాఖ్యలు భారీ వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మరియు కాంగ్రెస్ ప్రముఖ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుసగా స్పందిస్తున్నారు. పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంగా హెచ్చరించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా మాట్లాడుతున్నానని పేర్కొన్న ఆయన, పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను అవమానించేలా వ్యాఖ్యానించారని అభిప్రాయపడ్డారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఇది ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు చెప్పే మాటలుకాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను బాధపెట్టేలా చేసిన ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు లేదా నరేంద్ర మోదీ స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ కూడా పవన్‌ను తీవ్రంగా విమర్శించారు. సినిమాల షూటింగ్‌లు, వ్యాపారం, అభివృద్ధి—అన్నిటి కోసం తెలంగాణ ఎంత కీలకమో తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రజలను అగౌరవపరిచేలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ఈ ప్రాంతమే వద్దనుకుంటే ఏపీలో ఉండాలని స్పష్టంగా తెలిపారు.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ, ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన నాయకుడు ప్రాంతాలపై దిష్టి వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యమేమీ కాదన్నారు. కోనసీమ సమస్యలను పరిష్కరించాల్సిన స్థాయిలో ఉన్న నేత ఇలా మాట్లాడటం బాధాకరమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉండే రాష్ట్రాలు..
తెలంగాణ తుఫాన్ లో మునుగుతుంటే మేము ప్రకృతి అనుకున్నాం తప్ప ఆంధ్రప్రదేశ్ ను తప్పుపట్టడం లేదు..
ఎక్కడో కోనసీమ లో కొబ్బరి… pic.twitter.com/CEI7fldwq6
— Ponnam Prabhakar (@Ponnam_INC) December 2, 2025
