Switch to English

తెలంగాణలో లెక్క తక్కువ చూపిస్తున్నారా?

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచీ గట్టి చర్యలే చేపట్టింది. లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ పదేపదే స్పష్టం చేస్తూ వచ్చారు. రెండోసారి లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కూడా ఆయన గట్టి వైఖరే కనబరిచారు. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు.. ఆర్థికంగా నష్టపోతే అప్పో సప్పో చేసి పూడ్చుకోవచ్చు అని చాలాసార్లు చెప్పారు.

లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కేంద్రాని కంటే కాస్త ముందుకే ఉంటున్నారు. జనతా కర్ఫ్యూ ఒకరోజు పాటించాలని మోదీ పిలుపునిస్తే.. రెండు రోజులు చేద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. లాక్ డౌన్ రెండో విడతను మే 4 వరకు కేంద్రం పొడిగిస్తే.. తెలంగాణలో ఈనెల 7 వరకు పొడిగించారు. ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు ఇవ్వొచ్చని కేంద్రం వెసులుబాటు కల్పిస్తే.. రాష్ట్రంలో అలాంటివి వేటికీ ఆయన అనుమతించలేదు. తాజాగా కేంద్రం లాక్ డౌన్ ను మే 17 వరకు ప్రకటించగా.. 21 వరకు దీనిని పొడిగించే యోచనలో కేసీఆర్ ఉన్నారు.

పైగా సడలింపుల విషయంలోనూ ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సడలింపులు ఇవ్వాలా, వద్దా? ఇస్తే ఎలా ఇవ్వాలి వంటి అంశాలపై సుదీర్ఘంగా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ఇలా లాక్ డౌన్ విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న తెలంగాణ సర్కారు.. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఎక్కువయ్యాయి.

కరోనా నిర్ధారణ పరీక్షలు సరిగా చేయడంలేదని, నమోదైన కేసులను తక్కువ చేసి చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే మరణాల సంఖ్యను సైతం సరిగా వెల్లడించడంలేదని అంటున్నారు. కేంద్రం నుంచి మూడు రోజుల పర్యటకు వచ్చిన బృందం తన పర్యటనను పొడిగించుకోవడానికి కారణం ఇక్కడి లెక్క తేల్చడానికేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే సంగతిని మంత్రి ఈటల రాజేందర్ ని అడిగితే తాము కేసులను దాచిపెట్టడంలేదని పేర్కొన్నారు. ఎడాపెడా పరీక్షలు చేయకుండా కేవలం వైరస్ చైన్ తెగ్గొట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. నిజానికి తెలంగాణలో సెకండరీ కాంటాక్టు కేసులకు పరీక్షలు నిర్వహించడంలేదని చాలామంది వైద్య సిబ్బంది చెబుతున్నారు. సూర్యాపేటలో కేసుల సంఖ్య భారీగా పెరగడానికి ఇదే కారణమని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఎలాంటి లక్షణాలూ లేకపోయినా కరోనా పాజిటివ్ గా తేలుతున్న తరుణంలో.. ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించడం మంచిదని సూచిస్తున్నారు. లేకుంటే అలాంటివారంతా గుప్తవాహకాలుగా కరోనా వ్యాప్తి మరింత ప్రబలడానికి అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత దారుణ పరిస్థితులు చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంలో ముందుంటున్న తెలంగాణ సర్కారు.. పరీక్షల విషయంలో కూడా ఇంతే కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

సినిమా

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

రాజకీయం

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

గ్యాస్‌ లీకేజీ : ఆ రైతులను ఆదుకునేది ఎవరు?

విశాఖ గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్‌ లీకేజీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: లారీ క్యాబిన్‌లో ఉరి వేసుకున్న డ్రైవర్‌

నెలన్నర రోజుల తర్వాత ఎట్టకేలకు లారీలు రోడ్డు ఎక్కాయి. ఈ సమయంలో ఆర్థికంగా డ్రైవర్లు చితికి పోయారు. వారి జీవితం ఆందోళనకరంగా మారింది. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవతున్నారు. ఆ...

ఫ్లాష్ న్యూస్: ఫుట్‌ బాల్‌ స్టేడియంలో ప్రేక్షకులకు బదులు బూతు బొమ్మలు

ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా అన్ని రంగాలను విభాగాలను ప్రభావితం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన ఆటలను కూడా కరోనా కారణంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో అంతర్జాతీయ టోర్నీలు కూడా...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌ ప్రస్తుతం హీరోయిన్‌ పూజా కుమార్‌ తో...

చిరు, ఎన్.టి.ఆర్ సినిమాలలో సరసన ఒకప్పటి హీరోయిన్.?

తెలుగు సినిమాలలో ప్రస్తుతం ఒకప్పటి హీరో, హీరోయిన్స్ ని, నటీనటుల్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి కాంబినేషన్స్ ని చాలా ఫ్రెష్ గా ఉండేలా డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. అందులో భాగంగానే...

ఫ్లాష్ న్యూస్: రోడ్డు మీద మిలియన్‌ డాలర్ల డబ్బు దొరికితే అతడేం చేశాడో తెలుసా?

రోడ్డు మీద పది రూపాయలు దొరికితే అటు ఇటు చూసి దాన్ని జేబులో పెట్టుకునే రోజులు. వేల రూపాయలతో ఉన్న పర్స్‌ రోడ్డు మీద కనిపిస్తే ఎవరిదో అనే విషయం కనీసం ఆలోచించకుండా...