తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఫిబ్రవరి 1 నుండి స్కూల్స్ ను పునః ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సాదారణ పరిస్థితులు వచ్చినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ప్రభుత్వం ను ఈ విషయమై పలు ప్రశ్నలను సంధించింది.
పాఠశాలలను పునః ప్రారంభించే విషయమై ఒక నిర్ణయానికి వచ్చారా అంటూ ప్రశ్నించగా.. ఇప్పటి వరకు ఆ విషయమై చర్చించలేదని.. ఇంకా సెలవుల గడువు ఉన్న కారణంగా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర అధికారులు తెలియజేశారు. ఈనెల 31న స్కూల్స్ తెరిచే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు గందరగోళంకు గురి అవుతున్నారు. ఇక సమ్మక్క సారక్క జాతక కోసం తీసుకుంటున్న చర్యలు ఏంటీ.. చేపట్టిన చర్యలు ఏంటో తెలియజేయాల్సిందిగా కూడా కోర్టు రాష్ట్ర ప్రభుత్వంను ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నట్లుగా ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది.