Switch to English

Chiranjeevi: ‘చిరంజీవి’ స్థాయి, స్థానమేంటో చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,202FansLike
57,764FollowersFollow

Chiranjeevi: చిరంజీవి.. ‘ఈ పేరే చాలా పవర్ ఫుల్ కదా’ అని దేవిశ్రీ ప్రసాద్ తనతో అన్నాడని దర్శకుడు సుకుమార్ ఓ సందర్భంలో అన్నారు. నిజమే అని నిరూపించే చాలా ఉదాహరణలు, సందర్భాలూ ఉన్నాయి. తెలుగు సినిమాకు మగమహారాజు చిరంజీవి. అదే ఆయనకు శ్రీరామరక్ష. ప్రేక్షకుల్లోనే కాదు, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో ఉద్దండుల్లో కూడా చిరంజీవి ఓ శిఖరం. అందుకే 100 కాదు.. 1000 మందిలో ఒకడిగా ఆయనకు గుర్తింపు.. ప్రత్యేక స్థానం దక్కుతుంది. ఇందుకు నిదర్శనం, తెలంగాణ ఫ్యూచర్ సిటీలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సు. వ్యాపార దిగ్గజాలతోపాటు సినీ ప్రముఖులకు ఆహ్వానం అందించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రముఖంగా చిరంజీవికి తగిన గుర్తింపునిచ్చి ఆయన స్థాయిని చెప్పింది.

Chiranjeevi: ‘చిరంజీవి’ స్థాయి, స్థానమేంటో చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

ప్రభుత్వ ఆహ్వానంపై చిరంజీవి తన రోల్స్ రాయిస్ కారులో సదస్సుకు వెళ్ళొచ్చు.. ఘన స్వాగతం అందుకోవచ్చు. కానీ, చిరంజీవికి అంతకుమించి గౌరవం ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చిరంజీవి కోసం ప్రత్యేక హెలికాఫ్టర్  ఏర్పాటు చేశారు. పరిశ్రమ తరపున చిరంజీవికి అందించిన గౌరవ, మర్యాదలు ఆయన స్థాయికి నిదర్శనం. చిరంజీవి కూడా అంతే వినయంతో వారి స్వాగతాన్ని మన్నించి సదస్సుకు వెళ్ళారు. మరోవైపు.. దేశంలో అగ్రగామి పారిశ్రామికవేత్తల్లో ఒకరైన మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా  కార్యక్రమంలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన చిరంజీవిని ఉద్దేశిస్తూ.. ‘మొత్తానికి మెగాస్టార్ చిరంజీవిగారిని కలుసుకున్నా. ఆయనొక లెజెండ్. తన వ్యక్తిత్వం, వినయం చిరంజీవిని ఎంతో విలక్షణంగా, ప్రత్యేకంగా చూపుతోంద’ని రాసుకొచ్చారు.

సింపుల్ గా.. చిరంజీవి అంటే ఇదే. తనను చిరంజీవిగాకాక తెలుగు సినిమా ప్రతినిధిగా ఆహ్వానించారని విధేయత చూపారు. పరిశ్రమ బాగు కోసం ప్రభుత్వ నిర్ణయాలకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ప్రకటించారు. పరిశ్రమకి ఇస్తున్న గుర్తింపుపై ప్రభుత్వాన్ని అభినందించారు. దశాబ్దాలుగా ఉన్న తన No.1 స్థానాన్ని, సినిమాల్నీ వదిలి రాజకీయాల్లో 9ఏళ్లు ఉన్నారు. అన్నేళ్ళలో చిరంజీవి వదిలెళ్ళిన కుర్చీ అలానే ఉండిపోయింది. మళ్ళీ చిరంజీవే వచ్చి ఇప్పటికి చేసిన ఆరు సినిమాల్లో మూడు, ఒకొక్కటీ 100కోట్ల షేర్ తో మళ్ళీ తన రాజసాన్ని చూపారు. తెలుగు సినిమా, బాక్సాఫీస్, ప్రేక్షకుల మనసుల్లో చిరంజీవి చేసిన చెరగని సంతకం ఇదే. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలనే పెద్దల మాటను చిరంజీవి పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకు చిరంజీవిపై తెలంగాణ ప్రభుత్వ తీరే ఉదాహరణ.

సినిమా

8 రోజుల్లో రాజా సాబ్… ఇంకా దూరమే గమ్యం!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ మధ్య తన ప్రయాణాన్ని...

మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర...

“చిరంజీవి సినిమా బాగుందంట…”ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్… 5 రోజుల్లోనే ₹226...

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ...

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

రాజకీయం

పవన్ కళ్యాణ్: పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే కూటమి ప్రభుత్వం… గ్రీన్ ఎనర్జీలో ఏపీకి కొత్త దిశ

పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వాలు మారినా విధానాల్లో స్థిరత్వం ఉండాలన్నదే తమ ప్రభుత్వ...

మాట నిలబెట్టుకున్న సీఎం… ఉద్యోగుల ఖాతాల్లో నగదు

సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన పండుగలా మార్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల...

Liquor Scam Case: విజయ్ సాయిరెడ్డికి ఈడీ నోటీసులు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన...

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

ఎక్కువ చదివినవి

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా తాత్కాలిక విరామంలోకి వెళ్లినట్లు ఫిల్మ్ నగర్...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

Daily Horoscope: మేషంలో ఉద్యోగ అవకాశాలు, వృషభంలో ఆర్థిక లాభాలు

జనవరి 13, 2026 బుధవారం రాశిఫలాలు: మేషం (Aries): ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. పై అధికారుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో చిన్న విషయాలపై చర్చలు ఉండొచ్చు....

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్ లు.. ఇలా క్రేజీ కాంబినేషన్లలో సినిమాలంటే...