Chiranjeevi: చిరంజీవిని కలిసిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు..! ఏమన్నారంటే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,223FansLike
57,764FollowersFollow

Chiranjeevi: ‘సినిమా ధియేటర్ల మనుగడకు పర్సంటేజీ విధానం కోరుతున్నామని.. ఇది ‘పెద్ది’కి సంబంధించిన సమస్య మాత్రమే కాదు.. ఇండస్ట్రీ’దని తెలంగాణ టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు అన్నారు. ప్రస్తుతం ధియేటర్లు, పర్సంటేజీ విషయంలో నెలకొన్న సమస్యపై తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేశ్ బాబు, కేఎల్ నారాయణ తదితరులు చిరంజీవితో ఆయన ఇంట్లో దాదాపు గంటన్నరపాటు భేటీ అయ్యారు. భేటీలో సమస్యలను చిరంజీవికి విన్నవించారు. సమావేశం అనంతరం దిల్ రాజు, ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ..

‘సింగిల్ ధియేటర్లో సినిమాల ప్రదర్శన, రెంటల్-పర్సంటేజీలపై తేడాలు, ఎగ్జిబిటర్లు సింగిల్ స్క్రీన్లపై ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకోగా  చిరంజీవి సానుకూలంగా స్పందించారు. ‘ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా’ అంటూ సింగిల్ స్క్రీన్ సమస్యలపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ నుంచి వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తానన్నారు. ఎగ్జిబిటర్లతో మాట్లాడి మేమూ తుది నిర్ణయం తీసుకుంటాం. రెండు రోజుల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నా’మని అన్నారు. చిరంజీవి సైతం వారితో.. అందరూ ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలని, రాబోయే సినిమాలకు ఇబ్బంది లేకుండా ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. మూడు రోజుల్లో నాలుగు సార్లు అదుపులోకి

యూట్యూబర్ బాచలకూరి జోసెఫ్ అలియాస్ "ప్రశ్న" రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 30 నుంచి జూలై 4 మధ్య మూడు రోజుల వ్యవధిలో నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. ప్రతి కేసులో...

అల్లూరి ఆశయాలే దేశానికి స్ఫూర్తి: పవన్ కళ్యాణ్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సందేశంలో అల్లూరి...

ఎక్కువ చదివినవి

ప్రశ్న రావణ్ అరెస్టుపై ప్రకాశ్ రాజ్ స్పందన.. చంద్రబాబు, పవన్‌కు బహిరంగ ప్రశ్నలు

యూట్యూబ్ ఛానల్ ప్రశ్నకు చెందిన జర్నలిస్టులు కేవీఆర్, రావణ్ అరెస్టుల వ్యవహారంపై నటుడు Prakash Raj స్పందించారు. ఈ అంశంపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu,...

రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు ఊపిరి.. వేల ఉద్యోగాలకు దారి!

రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపునిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ స్టీల్ ప్లాంట్ పునఃప్రారంభంపై వేగంగా చర్యలు చేపడుతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టి, ప్రాంత అభివృద్ధికి...

Chiranjeevi-Rajinikanth: ‘బాక్సాఫీస్ టైటన్స్..’ మరోసారి ‘చిరంజీవి-రజినీకాంత్’ క్లాష్

Chiranjeevi-Rajinikanth: సినిమాలకెప్పుడూ మంచి సీజన్ రిలీజ్ అవసరం. అన్ సీజన్లో రిలీజై వండర్స్ క్రియేట్ చేసిన సినిమాలూ ఉన్నాయి. కానీ, సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి, క్రిస్మస్.. ఇలా పండగ సీజన్లలో సెలవులు...

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రూ.6.3 కోట్లతో అభివృద్ధి పనులు.. లోకేష్ శంకుస్థాపన

మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.6.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు...

ఉద్యోగాల కోసం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే వారిగా ఎదగండి: లోకేష్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన జాతీయ విద్యా విధానం, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, వికసిత్ భారత్–2047 వంటి కార్యక్రమాలు దేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తున్నాయని, అదే స్ఫూర్తితో...