Switch to English

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ని కలిశారు. తెలంగాణ రాజకీయాల గురించి ఈ సందర్భంగా ఇరువురి మధ్యా చర్చ జరిగింది.

బీజేపీ – జనసేన మధ్య రాజకీయంగా పొత్తు కుదిరింది కొన్ని నెలల క్రితం. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ – జనసేన కలిసి పనిచేస్తున్నా, తెలంగాణలో ఇప్పటిదాకా బీజేపీ శ్రేణులతో జనసేన శ్రేణులు పెద్దగా కలవలేకపోయాయి. ఆ మాటకొస్తే, నేతల స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ – జనసేన కలిసినా, కార్యకర్తల స్థాయిలో ఆ కలయిక అంత ‘క్లియర్‌’గా లేదన్నది నిర్వివాదాంశం.

జనసైనికులు, ‘సోలో ఫైట్‌’నే ఇష్టపడుతున్నారు. పైగా, పవన్‌ కళ్యాణ్‌కి వున్న లక్షలాదిమంది అభిమానుల్లో మైనార్టీలు కూడా ఎక్కువే. వారంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారాయె. తెలంగాణలోనూ బీజేపీ – జనసేన కలయికకు ఇదే ఇబ్బందిగా మారే అవకాశం వుంది. మరోపక్క, బీజేపీ – జనసేన కలయికతో జనసేనకు లాభం ఏమీ లేదనీ, బీజేపీనే కాస్తో కూస్తో జనసేన వల్ల రాజకీయ లబ్ది పొందే అవకాశం వుంటుందని జనసైనికులు వాపోతున్నారు.

సరిగ్గా ఈ సమయంలో బీజేపీ – జనసేన తెలంగాణలో కలిసి పనిచేస్తే, అదీ తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తే.. అది జనసేనకు మరింత నష్టం చేకూర్చుతుందని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ – తెలంగాణ రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌ వివాదం ముదిరి పాకాన పడ్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో తమకు సహకారం అందించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌, జనసేనానిని కోరారు.

కానీ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మాత్రం పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణపై మండిపడ్తోంది. బీజేపీలోనే రెండు స్వరాలున్నప్పుడు.. జనసేనాని, ఇలాంటి వివాదాల్లో తలదూర్చడం ఎంతవరకు సబబు.? అన్న చర్చ జనసేన వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘సినీ పరిశ్రమ అంతా కేసీఆర్‌కి మద్దతుగా నిలుస్తోంది. ఈ తరుణంలో పవన్‌, కేసీఆర్‌కి వ్యతిరేకంగా నినదించడం మంచిది కాదు. పవన్‌ వరుస సినిమాలు చేస్తున్న దరిమిలా, ఆయన సినీ కెరీర్‌కి బీజేపీతో స్నేహం పెద్ద మైనస్‌గా మారే అవకాశాలున్నాయి..’ అని కొందరు జనసైనికులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...