Switch to English

తెలంగాణతో ‘నీటి పంచాయితీ’: ఏపీ వాదనలో ‘పస’ ఎంత.?

తెలంగాణ ప్రభుత్వం రికార్డ్‌ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేసింది. నిజానికి అత్యంత క్లిష్టతరమైన ప్రాజెక్టు ఇది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలు ఇప్పుడు జల కళను సంతరించుకున్నాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమే. నిజానికి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి అభ్యంతరాలున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాల్ని తెలంగాణ లైట్‌ తీసుకుంది.

చిత్రమేంటంటే, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక.. తెలంగాణతో ‘నీటి’ దోస్తీ కూడా కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌ కూడా హాజరయ్యారు. ఇప్పుడేమో, తెలంగాణలో చేపట్టిన కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నీటి మీద ఆధారపడ్డ ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం, ఆంధ్రప్రదేశ్‌ వాదనల్ని లైట్‌ తీసుకుంటున్నారు. ‘గోదావరిలో మిగులు నీరు వుంటుంది.. దాన్ని వాడుకుందాం..’ అని ఆంధ్రప్రదేశ్‌కి సూచిస్తున్నారు. కృష్ణమ్మ జోలికి మాత్రం రావొద్దంటున్నారు. ఇదిలా వుంటే, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచే దిశగా, దానికి అదనంగా ఇంకో లిఫ్ట్‌ ప్రాజెక్ట్‌ని చేపట్టి రాయలసీమకు ఎక్కువ నీళ్ళను కృష్ణా నది నుంచి తోడాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంకల్పిస్తే, దానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డు తగిలిన విషయం విదితమే. ఈ వివాదం నేపథ్యంలో కృష్ణా బోర్డుకి ఆంధ్రప్రదేశ్‌ తన వాదనల్ని సమర్థవంతంగా విన్పించింది.

కృష్ణా నదికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీల నీరు వాటాగా లభిస్తే, అందులో ఆంధ్రప్రదేశ్‌కి 512 టీఎంసీల వాటా, తెలంగాణకి 299 టీఎంసీలు వాటాగా దక్కుతున్నాయి. తమకు లభించిన 512 టీఎంసీల కోటాకి లోబడి మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి కొత్త ప్రాజెక్టు లింక్‌ చేసి తీసుకెళ్ళబోతున్నామన్నది ఆంధ్రప్రదేశ్‌ వాదన.

అయితే, శ్రీశౖలంలో 881 అడుగుల కంటే నీటి మట్టం తగ్గితే, రాయలసీమకు నీటి తరలింపు కష్ట సాధ్యంగా మారుతుంది. కానీ, అది ఏడాదిలో 10 నుంచి 15 రోజులు మాత్రమే సాధ్యపడుతుంది. 854 అడుగులకు నీటి మట్టం పడిపోతే, 7 వేల క్యూసెక్కులు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా తరలించడానికి వీలుపడుతుంది. అక్కడ ఆ స్థాయి నీటిమట్టం వుంచడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదని ఆంధ్రప్రదేశ్‌ చెబుతుండడం గమనార్హం.

796 అడుగులక నీటి మట్టం పడిపోయినా, తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ రోజుకి 42 వేల క్యూసెక్కులను తరలించగలగుతోందని ఆంధ్రప్రదేశ్‌, కృష్ణా బోర్డు ముందు వాపోయింది. అయినా, ఇవేవీ కొత్త విషయాలు కాదు. ఈ అంశాలపై తెలంగాణ నుంచి స్పష్టత కోరకుండానే తెలంగాణతో ‘నీటి దోస్తీ’కి సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. తెలంగాణలో మాత్రం, చకచకా పలు ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. ఇప్పుడు ఎంత గగ్గోలు పెట్టినా ఆంధ్రప్రదేశ్‌కి ఒరిగేది శూన్యం.

కొసమెరుపేంటంటే, ఆంధ్రప్రదేశ్‌ తనకు కేటాయించిన నీళ్ళ కంటే ఎక్కువ వాటా వాడేసుకుందంటూ కృష్ణా ట్రైబ్యునల్‌ తేల్చి చెప్పడం. వెంటనే సాగర్‌ కుడి కాల్వ, హంద్రీ నీవా, మచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల నిలిపివేయాలని కృష్ణా ట్రైబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. సాగర్‌ కుడి కాల్వ ద్వారా ఏపీకి 158.255 టీఎంసీల నీటిని ట్రైబ్యునల్‌ కేటాయిస్తే, 158.264 టీఎంసీల నీటిని ఏపీ ఇప్పటికే వాడేసుకున్నట్లు తెలిపింది కృష్ణా ట్రైబ్యునల్‌. మొత్తమ్మీద, ఎలా చూసినా తెలంగాణ వాదన ముందు ఆంధ్రప్రదేశ్‌ వాదన నెగ్గేలా కన్పించడంలేదు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: గొర్రెకుంట మృత్యుబావి మిస్టరీలో మరో ట్విస్ట్.!

ఈ రోజు ఉదయమే వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల మర్డర్ కి కారణమైన సంజయ్ కుమార్ యాదవ్ నిజానిజాలు ఒప్పుకోవడంతో ఈ మృత్యుబావి మిస్టరీ...

శ్రీదేవి ఇంట కరోనా పాజిటివ్ నమోదు

హాలీవుడ్ వారితో పోల్చితే ఇండియన్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడటం తక్కువే. ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ కరోనా బారిన పడి ఇబ్బందుకు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ కు కూడా...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ బాగా పెరిగింది. వరసగా టాలీవుడ్ లో...

టీటీడీ భూముల అమ్మకంపై వైసీపీ ‘రివర్స్‌ గేర్‌’ వెనుక.!

‘అవి నిరర్ధక ఆస్తులు.. చిన్న చిన్న భూములు కావడంతో అన్యాక్రాంతమవుతున్నాయి.. కబ్జాలనుంచి వాటిని రక్షించడం వీలు కావడంలేదు. ఈ క్రమంలో వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటే తప్పేంటి.?’ ఓ మంత్రిగారు చెప్పిన మాట...

చంద్రన్న ఛలో అమరావతి.. పార్టీ శ్రేణుల్లో ఏదీ ఆ ఉత్సాహం.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాదాపు రెండు నెలల విరామం తర్వాత అమరావతికి రానున్నారు. హైద్రాబాద్‌లోని తన ఇంటి నుంచి ఈ రోజు ఉదయమే బయల్దేరారాయన అమరావతికి రోడ్డు మార్గం ద్వారా....