Switch to English

జోంబీ రెడ్డి మూవీ రివ్యూ – ఈ జోంబీని ఫన్ కోసం ఒకసారి ట్రై చేయచ్చు

Critic Rating
( 2.75 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow
Movie జోంబీ రెడ్డి
Star Cast తేజ సజ్జ, ఆనంది, దక్ష నాగర్కర్, గెటప్ శీను
Director ప్రశాంత్ వర్మ
Producer రాజ్ శేఖర్ వర్మ
Music మార్క్ కె రాబిన్
Run Time 2 గంటల 5 నిమిషాలు
Release ఫిబ్రవరి 5, 2021

మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన తేజ సజ్జ, ఇటీవలే సమంత ప్రధాన పాత్రలో చేసిన ‘ఓ బేబీ’ సినిమాతో హిట్ అందుకున్నాడు. తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతూ చేసిన మొదటి సినిమా ‘జోంబీ రెడ్డి’. ‘అ.!’, ‘కల్కి’ సినిమాల దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో మొదటి జోంబీ ఫిల్మ్ అది కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చెప్పిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

భారత ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ అనౌన్స్ చేసిన ప్రెస్ మీట్ తో సినిమా మొదలవుతుంది. దాంతో ఒక సైంటిస్ట్ కోవిడ్ వాక్సిన్ తయారు చేస్తున్నారు అనేదాని మీద కట్ చేసి మన హీరో తేజ సజ్జ మీద ఓపెన్ చేస్తే.. తేజ సజ్జ, దక్ష నాగర్కర్, కిరీటి, ఆర్జే హేమంత్ లు ఫ్రెండ్స్. వీరి ప్రొఫెషన్ గేమింగ్ డిజైనర్స్. లాక్ డౌన్ టైంలో ఆర్జే హేమంత్ తన పెళ్లి కర్నూల్ లో పెట్టుకోవడంతో వీళ్ళందరూ కర్నూల్ బయలుదేరుతారు. వీళ్ళు అక్కడికి వెళ్లే టైంకి అక్కడ ఒకతను తయారు చేసిన కరోనా వాక్సిన్ వికటించడంతో అక్కడ ఉన్న కొందరు జోంబీస్ అవుతారు. ఇంటర్వల్ టైంకి తేజ సజ్జ, ఆనంది, దక్ష నాగర్కర్, గెటప్ శీను, ఆర్జే హేమంత్ లు తప్ప ఊరంతా జోంబీస్ గా మారిపోతారు. ఇక అక్కడి నుంచీ ఈ ఐదుగురు ఆ జోంబీస్ నుంచి ఎలా తమ ప్రాణాల్ని కాపాడుకున్నారు? వారి ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ ఏమన్నా దొరికిందా? లేదా? చివరికి వాళ్ళు కూడా జోంబీస్ అయిపోయారా? అనేదే కథ.

తెరమీద స్టార్స్..

చైల్డ్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత ఓ బేబీలో కుర్రాడి పాత్రలో కనిపించి మెప్పించిన తేజ సజ్జ డెబ్యూ ఫిలిం కోసం రెగ్యులర్ ప్రేమకథల్ని ట్రై చేయకుండా ఒక జోంబీ ఫిలింని ఎంచుకోవడం మెచ్చుకోదగిన విషయం. అలాగే తన పాత్రలో ఎక్కడా మీటర్ క్రాస్ కాకుండా అనుకున్న పాత్రలో చాలా సెటిల్ గా చేసి మెప్పించాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. ఇక దక్ష నాగర్కర్ ఇచ్చిన టామ్ బాయ్ పాత్రలో బాగా చేసింది కానీ సినిమాలో చెప్పుకోదగిన లెంగ్త్ పాత్ర అయితే కాదు. ఉన్నంతలో గ్లామర్ కూడా యాడ్ చేసి ఆకట్టుకుంది. కీలక పాత్ర చేసిన నందిని పగా ప్రతీకారాలు ఉన్న ఫ్యాక్షనిస్ట్ బిడ్డగా బాగా చేసింది. పలు చోట్ల నవ్వించింది కూడాను. ఇక సినిమాకి ప్రధాన హైలైట్ అయిన గెటప్ శీను గురించి చెప్పుకోవాలి. అలా అలా వెళ్లిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండాఫ్ ని ఒక్కసారిగా హై ఫీల్ కి తీసుకెళ్లింది తన సీన్స్. గెటప్ శీను డైరెక్టర్ రాసుకున్న సీన్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడం వలన సెకండాఫ్ బాగుందనిపిస్తుంది. ఆర్జే హేమంత్ ఓపెనింగ్ సీన్స్ మరియు ఫస్ట్ నైట్ సీన్ లో బాగా నవ్విస్తాడు. అన్నపూర్ణమ్మ ముసలి జోంబీగా నవ్వులు పూయిస్తుంది. ఓవరాల్ గా జోంబీ రెడ్డి సినిమాకి పర్ఫెక్ట్ గా కాస్టింగ్ సెట్ అయ్యిందని చెప్పచ్చు.

తెర వెనుక టాలెంట్..

ఆన్ స్క్రీన్ మీద ఉన్న అందరూ ఎలా తమ బెస్ట్ ఇచ్చి ఆడియన్స్ ని మెప్పించారో అలాగే టెక్నికల్ గా కూడా అందరూ ది బెస్ట్ ఇచ్చారని చెప్పచ్చు. ముందుగా కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి ఓ జోంబీ సినిమాని చెప్పాలనుకోవడం చూసే వారికి ఫ్రెష్ గా అనిపించే పాయింట్. కర్నూల్ సెటప్ కొత్త కాదు కానీ జోంబీస్ అనేది తెలుగు స్క్రీన్ కి ఫస్ట్ టైం కానీ ఆర్ట్ అండ్ మేకప్ టీం చాలా జాగ్రత్తలు తీసుకొని జోంబీస్ అండ్ సెటప్ ని చాలా బాగా క్రియేట్ చేశారు. వాళ్ళు అంత బాగా డిజైన్ చేయడం వలనే జోంబీస్ సెటప్ చూడటానికి ఫ్రెష్ గాను, కొత్తగానూ ఉంటుంది. ఇకపోతే అనిత్ అటు రాయలసీమ లుక్ ని, ఇటు జోంబీస్ ఫీల్ ని తన విజువల్స్ లో పర్ఫెక్ట్ గా చూపించగలిగాడు. ఆ విజువల్స్ కి మార్క్ కె రాబిన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. అటు ఫన్, భయం కలిగించే సీన్స్ మరియు ఎలివేషన్స్ ఇలా అన్ని సీన్స్ కి పర్ఫెక్ట్ మ్యూజిక్ అందించడం వలన ఆడియన్స్ హుక్ అవుతారు.

ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే.. పైన చెప్పినట్టు కథ కోసం ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ అండ్ పాయింట్ బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ ని ఇంకాస్త బెటర్ గా రాసుకొని ఉండాలి అనిపిస్తుంది. దానికి కారణం ఫస్ట్ హాఫ్ లో సీన్స్ ఎక్కడో చూసిన ఫీలింగ్ రావడం, ఫన్ కూడా అక్కడక్కడే వర్క్ అవుట్ అవ్వడంతో బిలో యావరేజ్ అనుకునే టైంకి ఓ మంచి ఇంటర్వల్ వలన సెకండాఫ్ మీద హోప్ వస్తుంది. లక్కీగా సెకండాఫ్ మొదలవ్వడం దగ్గర నుంచీ ఫుల్ నవ్విస్తూ ఉండడం, అలాగే వేసుకున్న ఎలివేషన్ సీన్స్ ఇలా అన్నీ ఎంగేజింగ్ గా ఉండడం వలన ఎంజాయ్ చేస్తూ చూడగలం. సెకండాఫ్ గెటప్ శీను సీన్స్, జోంబీస్ తో జరిగే యాక్షన్ ఎపిసోడ్, చేజింగ్స్ చాలా బాగా చేశారు. కానీ క్లైమాక్స్ మాత్రం 50 – 50 అన్నట్లు ఉంది. క్లైమాక్స్ తీసిన విధానం బాగుంది కానీ కథకి అయితే పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ కాదనే లాజిక్ కొంత మందిని నిరాశపరిస్తే, కొంతమంది ఓకే ఓకే అనుకునేలా ఉంటుంది. కథనం పరంగా ఫస్ట్ హాఫ్ లో ఇంకొంత కేర్ తీసుకోవాల్సింది. డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ బాగా చేసాడు, ఈ సారి కమర్షియల్ గా కూడా హిట్ అందుకుంటాడనే చెప్పచ్చు. ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– ఇంటర్వల్ ఎపిసోడ్
– గెటప్ శీను – అన్నపూర్ణమ్మ కామెడీ సీన్స్
– జోంబీస్ తో జరిగే యాక్షన్ ఎపిసోడ్
– ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ గా అనిపించే సెకండాఫ్
– నటీనటుల పెర్ఫార్మన్స్

బోరింగ్ మోమెంట్స్:

– అంత ఎఫెక్టివ్ గా లేని ఫస్ట్ హాఫ్
– రెగ్యులర్ గా అనిపించే కథనం
– ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండు అనిపించే క్లైమాక్స్

విశ్లేషణ:

యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా చేసిన మొదటి సినిమా ‘జోంబీ రెడ్డి’ సినిమా ముగిసే సరికి చూసిన అందరూ సెకండాఫ్ గురించి మాట్లాడుకుంటూ హ్యాపీగానే బయటికి వస్తారు. అది జరగాలంటే ఫస్ట్ హాఫ్ ని కొంత భరించాలి. దానికి కారణం ఫస్ట్ హాఫ్ లో ఎంగేజింగ్ మోమెంట్స్ చాలా తక్కువగా, రొటీన్ గా ఉండడం. నటీనటుల పెర్ఫార్మన్స్, సెకండాఫ్ ఫన్ అండ్ థ్రిల్స్ మెప్పిస్తాయి. ఓవరాల్ గా జోంబీ సెటప్ తెలుగు ఆడియన్స్ కి రిఫ్రెషింగ్ గా అనిపించడం వలన ఈ సీజన్ లో ఓ సారి చూడదగిన సింపుల్ జోంబీ ఫన్ ఫిల్మ్ అని చెప్పచ్చు.

చూడాలా? వద్దా?: ఒకసారి ట్రై చేయచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2.75/5 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...