Switch to English

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సర్వ సన్నద్ధమయ్యిందట. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్‌, ఏలూరు సాంబశివరావు, ఏ క్షణాన అయినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ అయి పార్టీ కండువా కప్పుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. గొట్టిపాటి రవికి చెందిన గ్రానైట్‌ క్వారీల విషయంలో ఈ మధ్య సమస్యలు ఎక్కువయ్యాయనీ, అవన్నీ అధికార పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా కల్పించిన ఇబ్బందులనీ, వాటి నుంచి తప్పించుకోవడానికి వేరే దారి లేక గొట్టిపాటి రవి వైసీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారట.

ఇదిలా వుంటే, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్‌, మద్దాలి గిరి ఇప్పటికే టీడీపీని వీడారు. మొత్తంగా చూస్తే టీడీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే వ్యూహంతో వైసీపీ అధిష్టానం పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే, టీడీపీని వీడి వైసీపీలో చేరాలనుకుంటున్న ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి షరతు విధించారట.

మరోపక్క, టీడీపీ అసంతృప్త ఎమ్మెల్యేలంతా గ్రూపుగా ఏర్పడి, స్పీకర్‌ వద్దకు వెళ్ళనున్నారనీ, తమను ప్రత్యేక గ్రూపు కింద అసెంబ్లీలో పరిగణించాలని స్పీకర్‌ని కోరనున్నారనీ, అలా చేసేత అనర్హత వేటు తప్పించుకోవచ్చన్న కోణంలోనే ఎమ్మెల్యేలంతా వ్యూహ రచన చేస్తున్నారనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం విదితమే. ముగ్గురు ఎంపీలుగా విజయం సాధించారు. అయితే, ఆ ముగ్గురిలోనూ ఇద్దరు ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌ కూడా పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తితో వున్నారనే ప్రచారం గత కొన్నాళ్ళుగా జరుగుతోంది.

సినిమా

హీరోయిన్‌ నుండి హీరోకు కూడా కరోనా పాజిటివ్‌?

తెలుగు బుల్లి తెరకు చెందిన వారిని కరోనా వైరస్‌ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే తెలుగు టీవీ రంగానికి చెందిన వారు పదుల సంఖ్యలో కరోనా...

స్పెషల్ స్టోరీ: ఆల్బమ్ సూపర్ హిట్, కానీ దేవీశ్రీ ప్రసాద్ కి...

ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. ఇటీవల కాస్త స్లో డౌన్ అయినట్టు కనిపిస్తున్నా...

ఎక్స్ క్లూజివ్: బోల్డ్ హీరోయిన్ బాలకృష్ణ – బోయపాటి సినిమా ఓకే...

'ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి, శీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా...

పుష్పలో టాలెంటెడ్ నటుడి పాత్ర?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెల్సిందే. తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్...

నాని హీరోయిన్ కు వరంగా మారిన లాక్ డౌన్

న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ మూవీ జెర్సీ ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది శ్రద్ధ శ్రీనాథ్. తన వయసు కంటే పెద్ద పాత్రే...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: సేవ్‌ అమరావతి.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌.!

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తున్నాయి. వీటిల్లో కొన్ని ‘పాత పథకాలకు కొత్త పేర్లు’ అయితే, ఇంకొన్ని నిజంగానే కొత్త సంక్షేమ కార్యక్రమాలు. ఆయా...

మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభన మామూలుగా లేదు. మొన్నటి వరకు సెలబ్రెటీలకు, రాజకీయ నాయకులకు వైరస్‌ దూరంగా ఉందనుకుంటున్న సమయంలో ఇప్పుడు వారికి కూడా పాజిటివ్‌ నిర్థారణ అవుతోంది. ఏపీలో ఇప్పటికే...

బ్రేకింగ్: వైసీపీ నేత హత్యకేసులో టీడీపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ...

ఏసీబీ కోర్టులో చుక్కెదురు:అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ఈఎస్ఐ స్కాంలో జైలులో ఉన్న అచ్చెన్నాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏసీబీ వాదించింది. దీంతో ఏసీబీ కోర్టు...

జగన్‌ సర్కార్‌కి జనసేనాని అభినందనలు.. ఇదీ ‘బాధ్యత’ అంటే.!

రాజకీయాల్లో వున్నాక, బాధ్యతగా వుండాలి..’ మొదటి నుంచీ జనసేన పార్టీ చెబుతున్నది ఇదే. ‘మంచి చేసినప్పుడు ప్రభుత్వాన్ని అభినందిస్తాం.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం..’ అని గతంలో.. అంటే చంద్రబాబు హయాంలోనూ చెప్పారు.. ఇప్పుడూ...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్‌ స్టోరీ: దెబ్బతింటోన్న విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరాల్లో విశాఖపట్నం కూడా ఒకటి. నిజానికి విశాఖ, ఆంధ్రప్రదేశ్‌కి ఆర్థిక రాజధాని. ఉమ్మడి తెలుగు రాష్ట్రం హైద్రాబాద్‌ తర్వాతి స్థానం విశాఖదే. దురదృష్టవశాత్తూ ఉమ్మడి రాష్ట్రం విభజన...

కరోనా తగ్గినా.. ఇంకా హాస్పిటల్లోనే , ఇంటికి రానివ్వని అయినోళ్లు!

మనం బాగున్నప్పుడు కాదు.. కష్టాల్లో ఉన్నప్పుడే మానవ సంబంధాలు ఎలా ఉంటాయో తెలుస్తాయని అంటూంటారు. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తున్నాయి ప్రస్తుత కరోనా పరిస్థితులు. కరోనా నుంచి కోలుకున్న వారికి పైమాటలే...

బ్రేకింగ్: విశాఖలో మరో గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి

విశాఖను గ్యాస్ లీకేజీలు వదలడం లేదు. తాజాగా మరో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపుతోంది. విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీక్ అయింది. సాయినార్ ఆఫ్ సైన్సెస్ కంపెనీలో గ్యాస్ లీక్,...

సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణానికి ఎదురైన ఆటంకాలు తొలగిపోయాయి. పాత సచివాలయం కూల్చేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త సచివాలయ నిర్మాణానికి దారులు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ వాదనలతో...

ఖమ్మం జిల్లాలో దారుణం.. కోతిని ఉరితీసి.. ఆపై..

జంతువుల్ని హింసించడం నేరమని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితుల్లో ఏమార్పూ లేదు. ఇటివల కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును పైన్ ఆపిల్ లో బాంబు పెట్టి చంపేశారు కొందరు దుండగులు. దేశం మొత్తం...