Switch to English

TDP-Janasena: జనసేన కండువా టీడీపీ నేతల మెడలో.! అప్పుడే మొదలైంది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,384FansLike
57,764FollowersFollow

ఔను, తెలుగుదేశం పార్టీతో కలిసి రాజకీయంగా నడవబోతున్నాం.! ఈ మాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్ననే అధికారికంగా ప్రకటించారు. ఇంతకు ముందు వరకు ‘కలిసి పని చేయాలనుకుంటున్నాం..’ అని మాత్రమే చెప్పారు జనసేనాని. చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ అయిన తర్వాత, జనసేనాని చేసిన అధికారిక.. అత్యంత సంచలన ప్రకటన.. కలిసి పని చేయడం గురించే.

ఇక, ఆ వెంటనే గ్రౌండ్ లెవల్‌లో టీడీపీ శ్రేణులు పని మొదలు పెట్టేశాయి. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో ఓటు షేరింగ్ అనేది అత్యంత కీలకం కాబోతోందని టీడీపీకి బాగా తెలుసు. స్వర్గీయ ఎన్టీయార్ తనయుడు నందమూరి రామకృష్ణ, టీడీపీ కండువాతోపాటు మెడలో జనసేన కండువా వేసుకుని, ప్రజల దగ్గరకు వెళుతున్నారు.

అరాచక పాలనను అంతమొందించాలనీ, వైసీపీని ఓడించాలనీ పిలుపునిస్తున్నారాయన. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన అభ్యర్థుల్ని గెలిపించాలని నందమూరి రామకృష్ణ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కింది స్థాయిలో టీడీపీ క్యాడర్, తమ పార్టీ జెండాలతోపాటు, జనసేన జెండాల్ని కూడా చేతపట్టుకుని జనంలోకి వెళుతుండడం గమనార్హం.

అయితే, జనసేన పార్టీకి సంబంధించి ఇంకాస్త స్తబ్దత కొనసాగుతోంది. కింది స్థాయిలో టీడీపీని కలుపుకుపోవడంపై జనసైనికులు కొంత తటపటాయిస్తున్నారు. ఆ సందిగ్ధం కూడా రేపో మాపో తొలగిపోనుంది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్య నేతలతో, రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే, టీడీపీ – జనసేనతోపాటు బీజేపీ కూడా కలిసి రావాలని జనసేనాని ఆశిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే బీజేపీ అధినాయకత్వానికి తన ఆలోచనల గురించి జనసేనాని వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో బీజేపీ నుంచి కూడా ఈ విషయమై స్పష్టత రాబోతోంది.

ఇప్పటికే ఏపీ బీజేపీ, చంద్రబాబు అరెస్టుని ఖండించింది. అయితే, బీజేపీ జాతీయ నాయకులు మాత్రం ఈ విషయమై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. టీడీపీ – జనసేనతో కలిసి రాజకీయంగా ముందడుగు వేసే విషయమై బీజేపీ నిర్ణయం తీసుకోవాల్సి వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

విజయ్ ఆంటోని ‘ తుఫాన్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

"బిచ్చగాడు" సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో విజయ్ ఆంటోనీ. మరోసారి ఆయన "తుఫాన్" మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను ఇన్ఫినిటీ...

Kalki 2898: ప్రీ-బుకింగ్స్ లో కల్కి స్పీడ్..! RRR ను దాటేసిందా..!?

Kalki 2898: ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 28798 AD). దేశంలోనే...

Sreeleela: మళ్లీ శ్రీలీల హవా..! వరుస సినిమాలు.. బిజీ బిజీ..

Sreeleela: ఏడాది క్రితం తెలుగులో శ్రీలీల (Sreeleela) రేంజ్ చూస్తే మరో రెండు-మూడేళ్లు ఆమె కొత్త సినిమాలకు దొరకడం కష్టమనే మాట వచ్చింది. రవితేజ ధమాకాతో...

Pavithra Gowda: ‘దర్శన్ కు చెప్పి తప్పు చేశా’.. అభిమాని హత్యపై...

Pavithra Gowda: కన్నడ హీరో దర్శన్ (Darshan) అభిమాని హత్య కేసులో అరెస్టు కావడం కన్నడనాట సంచలనం రేపింది. దీనిపై హత్య కేసులో ప్రధాన నిందితురాలైన...

Sunny Leone: సన్నీ లియోన్ ఈవెంట్ కు పర్మిషన్ ఇవ్వని యూనివర్శిటీ..!

Sunny Leone: నటి సన్ని లియోని (Sunny Leone)కి కేరళ (Kerala)లోని ఓ యూనివర్శిటీ షాక్ ఇచ్చింది. ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు యూనివర్శిటీ అనుమతి నిరాకరించింది....

రాజకీయం

ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో జగన్ రాజీనామా చేయిస్తారా.?

ప్రత్యేక హోదా మళ్ళీ గుర్తుకొచ్చింది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. అదేంటో, అధికారంలో లేనప్పుడే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.! తర్వాతేంటి.?

‘సీఎం.. సీఎం.. అంటూ అరిస్తే సరిపోదు.. ఓట్లెయ్యండి.. ఓట్లు వేయించండి.. అభిమానులు, జనసైనికుల్లా మారండి. చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించగలిగినప్పుడు.. పదవులు వాటంతట అవే వస్తాయ్..’ అని పలు సందర్భాల్లో అభిమానుల్ని...

ఇన్‌సైడ్ స్టోరీ: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారా.?

శాసన మండలి అంటే, ఖర్చు దండగ వ్యవహారమంటూ గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో నినదించారు. అంతే కాదు,...

జైలు నుంచి విడుదలైన నటి హేమ

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ సీనియర్ నటి హేమ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. గత నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేసిన...

డిప్యూటీ సీఎం గారి తాలూకా.. అభిమానుల కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్

కొన్నాళ్ల క్రితం వచ్చిన కమ్ బ్యాక్ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ఓ డైలాగ్ చెప్తారు. ' నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తాను' అని.....

ఎక్కువ చదివినవి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.! తర్వాతేంటి.?

‘సీఎం.. సీఎం.. అంటూ అరిస్తే సరిపోదు.. ఓట్లెయ్యండి.. ఓట్లు వేయించండి.. అభిమానులు, జనసైనికుల్లా మారండి. చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించగలిగినప్పుడు.. పదవులు వాటంతట అవే వస్తాయ్..’ అని పలు సందర్భాల్లో అభిమానుల్ని...

Ram Charan: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ కు ఆహ్వానం

Ram Charan: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena)-టీడీపీ (Tdp)-బీజేపీ (Bjp) అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. జూన్ 12 (బుధవారం) ఉదయం 11.27గంటలకు...

ఇంతలా ఓడినా, జగన్ బుకాయింపులు ఆగలేదేం.?

ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. నిజానికి, చెంప దెబ్బ కొట్టారు వైసీపీకి.! సంక్షేమాన్ని ప్రజలు మెచ్చలేదు. వైసీపీకి అధికారాన్ని దూరం చేశారు. కేవలం 11 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టారు. ఇది నిజానికి, అత్యంత ఘోర...

‘ ఈనాడు ‘ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

' ఈనాడు' సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈనెల 5న మరోసారి అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరారు....

Mokshagna : ఇప్పుడైనా మోక్షజ్ఞ రావాల్సిందే..!

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాదిలో కూడా ఉండే అవకాశాలు లేవు అని తేలిపోయింది. గత మూడు...