ఇదెక్కడి మాస్ ర్యాగింగ్ పట్టాభి? ఎస్పీకి వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,724FansLike
57,764FollowersFollow

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. వైఎస్ఆర్సిపి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కొమ్ముకాసిన అధికారుల్లో భయం మొదలైంది. ఈ నేపథ్యంలో తనని వేధించిన ఎస్పీ కి టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ తన స్టైల్ లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనపై అక్రమ కేసులు బనాయించి తనని వేధించిన ఎస్పీని వదిలేది లేదంటూ హెచ్చరించారు. ఈ మేరకు పట్టాభి గతంలో కృష్ణాజిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా ఇంటికి వెళ్లారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.

‘ నాపై అక్రమ కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ తో రాచ మర్యాదలు చేసిన ఎస్పీ జాషువా ని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాను. ఆయన కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు తోటవల్లూరు పోలీస్ స్టేషన్ లో నన్ను నిర్బంధించి అర్ధరాత్రి సమయంలో కరెంటు తీసేసి మరీ నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆయనని కలిసి సత్కరించాలని వచ్చాను. ఆయన తనకున్న ఏడెకరాల విశాలమైన ఫామ్ హౌస్ లో ఉన్నారని తెలుసుకొని శాలువ, పూల బొకే తీసుకుని వచ్చాను. కానీ ఆయన ఇక్కడ లేరు. నిన్నటి నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని తెలిసింది. అందుకే ఈ శాలువా, బొకేని ఇక్కడే పెట్టి వెళుతున్నా’ అని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పట్టాభి.. తనకు రాచ మర్యాదలు చేసిన ఎస్పీని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఇప్పటికే ఎస్పీ ఫోన్ కి పంపించినట్లు తెలిపారు.

అసలేం జరిగిందంటే..

అప్పటి టీడీపీ నేత వల్లభనేని వంశీ.. వైసీపీ కి మద్దతిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. ఆ కారణంతో కొందరు గన్నవరంలోని టీడీపి ఆఫీస్ ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న హింసకు పట్టాభిరామ్ కారణమయ్యారన్న నెపంతో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు.

2023 ఫిబ్రవరి 20న పట్టాభిని తోటవల్లూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత ఆయన్ని కోర్టుకి అప్పజెప్పే సమయంలో ఆయన ఒంటిపై గాయాలు కనిపించాయి. ఆయనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు పట్టాభిరామ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల హింస మరింత పెరిగిందని అప్పట్లో కృష్ణాజిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా మీడియాకి తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న పట్టాభి బుధవారం ఎస్పీని కలవడానికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారు.

755 COMMENTS

సినిమా

“పెద్ద కలలు కనండి.. కష్టపడితే విజయం మీదే” – ‘చెన్నై లవ్...

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ...

బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ హెల్త్ బులెటిన్.. గాయం వివరాలు వెల్లడి

నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా ఎడమ మోకాలికి గాయం కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు...

‘సమ్మర్ హాలిడేస్’లో జయసుధ అమ్మమ్మ లుక్ విడుదల

కథా ప్రధానమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని, తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న చిల్డ్రన్ మూవీ...

Chiranjeevi Birthday Special: చిరంజీవి మాస్ సినిమాలకు C/o దొంగమొగుడు

Chiranjeevi Birthday Special: ప్రతి ఏటా ఆగష్టు నెల వస్తుందంటే మెగాభిమానుల్లో ఆనందోత్సాహలు. ప్రతి ఏటా ఆగష్టు నెల రావడంతోనే చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22వ...

బాలయ్య త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్ష

కాకినాడలో 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై...

రాజకీయం

తిరుమలలో హనుమాన్ విగ్రహం అపహరణ.. 24 గంటల్లో నివేదిక కోరిన మంత్రి

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే డౌన్ ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద భక్తులు ప్రతిష్ఠించిన చిన్న హనుమాన్ రాతి విగ్రహం అపహరణకు గురైన ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం...

నీట్ రగడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చెయ్యాల్సిందేనా.?

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ఓ వైపు.. నీట్ వివాదం ముసుగులో అసాంఘీక శక్తుల అరాచకం ఇంకో వైపు.. వెరసి, దేశ రాజధానిలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది. పోటీ పరీక్షలకు...

పవన్‌పై ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి: జనసేన తెలంగాణ

హైదరాబాద్‌లోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్...

ప్రభుత్వ పాఠశాలలే ఆదర్శం కావాలి: లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, ప్రైవేటు పాఠశాలలు కూడా చూసి అసూయపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో...

కాదంబరి జెత్వానీ కేసు.. అసలు నిజాలివే!

కాదంబరి జెత్వానీ వ్యవహారం మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ అంశంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు పోస్టుల్లో...

ఎక్కువ చదివినవి

రాజమండ్రి, కాకినాడలో సందడి చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్

తమ కొత్త చిత్రం **'చెన్నై లవ్ స్టోరీ'**ని ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరీ...

మెగా డీఎస్సీపై వైసీపీ పిటిషన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

మెగా డీఎస్సీ నియామకాల అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (PIL) కొట్టివేయబడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో మెగా డీఎస్సీ...

జయం ఆడిషన్ నుంచి గంగోత్రి వరకు… అల్లు అర్జున్ వెనుక చిరంజీవి అండ!

అల్లు అర్జున్ సినీ కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ ఆసక్తికరమైన ఘటన గురించి ఇండస్ట్రీలో చాలాకాలంగా వినిపించే కథ ఇప్పుడు మరోసారి చర్చలోకి వచ్చింది. దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం సినిమా కోసం...

కాదంబరి జెత్వానీ కేసు.. అసలు నిజాలివే!

కాదంబరి జెత్వానీ వ్యవహారం మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ అంశంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు పోస్టుల్లో...

బాలయ్య-కొరటాల సినిమాలో ఐశ్వర్య రాజేష్?

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్...