Switch to English

టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.?

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? ఎప్పుడో రెండున్నరేళ్ళ క్రితమే అరెస్టు కావాల్సిన మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ ఎట్టకేలకు అరెస్టయ్యారు. అసలు ఆయనెందుకు అరెస్టవ్వాలి.? అంటే, అమరావతి కుంభకోణంలో తొలుత వినిపించిన పేరు నారాయణదే. అప్పట్లో మంత్రిగా వున్నప్పుడు అమరావతి వ్యవహారాల్ని ఆయనే స్వయంగా పర్యవేక్షించిన సంగతి తెలిసిందే.

అమరావతి పేరుతో మంత్రి నారాయణ అడ్డంగా దోపిడీకి పాల్పడ్డారని ప్రతిపక్షంలో వున్నప్పుడు వైసీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే నారాయణ సహా, టీడీపీ అధినేత చంద్రబాబుని సైతం అమరావతి కుంభకోణంలో అరెస్టు చేసి జైలుకు పంపుతామని వైసీపీ చెబుతూ వచ్చింది.

కానీ, అధికారంలోకి వచ్చాక, మూడేళ్ళ తర్వాత నారాయణ అరెస్టు జరిగింది. కానీ, అమరావతి కేసులో కాదట. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించి ఆయన్ని అరెస్టు చేశారట.

మొన్నీమధ్యనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలో మాట్లాడుతూ, పదో తరగతి ప్రశ్నా పత్రాల లీక్ వెనుక శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలున్నాయనీ, నారాయణ విద్యా సంస్థల అధినేత టీడీపీ నాయకుడు నారాయణ అనీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ వ్యూహాత్మకంగా ఆయన్ని హైద్రాబాద్‌లో అరెస్టు చేసి, ఏపీకి తరలించినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీకి చెందిన చాలామంది నేతలు అరెస్టయ్యారు.. ఆయా కేసుల్లో అధికార పార్టీకే చుక్కెదురవుతూ వచ్చింది. మరి, నారాయణ వ్యవహారం ఏమవుతుందో వేచి చూడాలి.

ఇదిలా వుంటే, నారాయణ అరెస్టుని టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లోనే నారాయణను అరెస్టు చేశారంటూ టీడీపీ షరామామూలుగానే తమదైన వాదనను వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘హ్యాపీ బర్త్ డే’లో పాత్రలన్నీ హీరోలే.. సర్రియల్ కామెడీ సినిమా: లావణ్య...

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "హ్యాపీ బర్త్ డే". రవిశంకర్ యలమంచిలి సమర్పణలో క్లాప్...

‘ది వారియర్’ ప్రేక్షకులకు నచ్చుతుంది.. కథ విని ఎగ్జైట్ అయ్యా: కృతి...

యువ హీరో రామ్ పోతినేని ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో కృతి...

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి విడుదల చేసిన “రామన్న యూత్” ఫస్ట్ లుక్

"జార్జ్ రెడ్డి" చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అభయ్ బేతిగంటి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘రామన్న యూత్’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను...

సినీ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూత.. పవన్ కల్యాణ్ సంతాపం

ప్రముఖ సినీ పాత్రికేయుడు, సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఇటివల వయసు సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన...

బింబిసార ట్రైలర్‌.. మ్యాటర్ ఉన్న సినిమా

తెలుగు సినిమాల స్థాయి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. గ్రాఫిక్స్ తో తెలుగు సినిమాల స్థాయి అమాంతం పెంచేస్తున్నారు. గ్రాఫిక్స్‌ వర్క్‌ తో బాహుబలి ని...

రాజకీయం

నరేంద్ర మోడీ, కేసీయార్, వైఎస్ జగన్.! ఎవరెలా.? ఎవరికేంటి.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాలకు వచ్చి వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద్రాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు...

‘రైలు తగులబెట్టి నన్ను చంపాలని చూశారు..’ ఎంపీ రఘురామ ఆరోపణ

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రైలులో భీమవరం వెళ్తున్న తనను ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో చంపేందుకు కుట్ర పన్నారని.. ఇందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు...

జగనన్న విద్యా కానుక: పేదరికం పోవాలంటే చదువే మార్గం: సీఎం జగన్

పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలని.. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని సీఎం జగన్ అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో విద్యార్ధులకు కిట్లను పంపిణీ...

మురుగు కాల్వలో దిగి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. నియోజకవర్గ పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలోని మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ మురుగు కాల్వలో...

మెగాస్టార్ చిరంజీవిపై బులుగు పచ్చ అసహనం.!

మెగాస్టార్ చిరంజీవి చేసిన నేరమేంటి.? వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా.. అదేనండీ, బులుగు మీడియా.. అలాగే పచ్చ మీడియా.. ఎందుకు చిరంజీవి మీద విషం చిమ్ముతున్నట్టు.? ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: ఆదివారం 03 జూలై 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం సూర్యోదయం: ఉ.5:34 సూర్యాస్తమయం: సా.6:38 తిథి: ఆషాఢ శుద్ధ చవితి మ1:45 ని . వరకు తదుపరి ఆషాఢ శుద్ధ పంచమి సంస్కృతవారం: భాను వాసరః...

ఔను బీజేపీలో చేరబోతున్నాను : కొండా

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మళ్లీ పార్టీ మారబోతున్నాడు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఈయన బీజేపీలో జాయిన్ అవ్వడం కన్ఫర్మ్‌ అయ్యింది....

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి విడుదల చేసిన “రామన్న యూత్” ఫస్ట్ లుక్

"జార్జ్ రెడ్డి" చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అభయ్ బేతిగంటి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘రామన్న యూత్’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ...

రాశి ఫలాలు: మంగళవారం 05 జూలై 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం సూర్యోదయం: ఉ.5:34 సూర్యాస్తమయం: సా.6:38 తిథి: ఆషాఢ శుద్ధ షష్ఠి మ.3:02 వరకు తదుపరి ఆషాఢ శుద్ధ సప్తమి సంస్కృతవారం: భౌమ వాసరః (మంగళవారం) నక్షత్రము: పుబ్బ...

‘హ్యాపీ బర్త్ డే’ లో కొత్త ప్రపంచంలో సరికొత్త కామెడీ ఉంటుంది – రితేష్ రానా

మత్తు వదలరా చిత్రంతో క్రేజీ డెబ్యూ ఇచ్చిన దర్శకుడు రితేష్ రానా నుండి వస్తోన్న సెకండ్ మూవీ హ్యాపీ బర్త్ డే. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా జులై...