అమరావతిలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను అధికారికంగా ప్రకటిస్తూ, కొత్త సమీకరణాలతో ముందుకు వెళ్లే సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో Nara Lokeshను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించగా, Palla Srinivas ను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు.
టీడీపీ అధినేత N. Chandrababu Naidu నేతృత్వంలో రూపొందిన ఈ కమిటీలు అనుభవం, విధేయత, కష్టపడే తత్వం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కూర్చినట్లు తెలుస్తోంది. సీనియర్లకు గౌరవం ఇవ్వడంతో పాటు, కొత్తవారికి అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీ బలోపేతం లక్ష్యంగా పెట్టుకుంది. పొలిట్ బ్యూరోను 29 మందితో, జాతీయ కమిటీని 31 మందితో, రాష్ట్ర కమిటీని 185 మందితో ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులకు స్థానం కల్పించగా, రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, జోనల్ కోఆర్డినేటర్లు, కార్యదర్శులు వంటి కీలక పదవులను భర్తీ చేశారు.
ఈసారి కమిటీల కూర్పులో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలకు చోటు కల్పించడంతో పాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 185 మంది సభ్యుల్లో 122 మంది బడుగు వర్గాలకు చెందినవారే ఉండటం విశేషం. అదేవిధంగా, ఒక మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, క్లస్టర్ ఇన్చార్జ్ గుత్తికొండ ధనుంజయ్‌లను నేరుగా పొలిట్ బ్యూరోలో చేర్చడం పార్టీ తీసుకున్న ప్రత్యేక నిర్ణయంగా నిలిచింది. క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా, 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ, మహిళలకు పెద్దపీట వేస్తూ, అన్ని వర్గాలను సమన్వయం చేసేలా టీడీపీ కొత్త కమిటీలను రూపొందించింది.
