Switch to English

వైసీపీ, టీడీపీ కుమ్మక్కు.. న్యాయవ్యవస్థతో ఏంటీ ‘బంతాట’.?

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు.. పేరుతో వైఎస్ జగన్ సర్కార్ ఓ సంక్షేమ పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం విదితమే. వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న వ్యవహారమిది. రాష్ట్ర బడ్జెట్ ఎంత.? ఈ సంక్షేమ పథకానికి అయ్యే ఖర్చు ఎంత.? అసలు రాష్ట్రం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలా చేపట్టగలుగుతుంది.? ఇలా చాలా ప్రశ్నలు మొదట్లోనే తెరపైకొచ్చాయ్.

భూమిని సేకరించడం లేదా సమీకరించడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ గనుక, తక్కువ స్థలంలో బహుళ అంతస్తుల భవనాలు.. అంటే అపార్టుమెంట్లు కట్టించి పేదలకు ఇవ్వడం ద్వారా భూమి లభ్యత సమస్యను తగ్గించవచ్చన్నది కేంద్రం యోచన.

కానీ, ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, భూమిని ప్రజలకు కానుకగా ఇచ్చి, అందులో ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని జగన్ సర్కార్ సంకల్పించింది. ఈ క్రమంలో పెద్దయెత్తున భూముల్ని సేకరించడమో, సమీకరించడమో చేశారు. తెరవెనుకాల జరిగిన రాజకీయ అవినీతి గురించి కొత్తగా చెప్పేదేముంది.?

ఇంకా కొన్ని చోట్ల వివాదాల కారణంగా, భూముల వ్యవహారంపై గందరగోళం వుంది. ఇంతలోనే, ఈ వ్యవహారంపై మరో పిటిషన్ దాఖలైంది.. ఇళ్ళ నిర్మాణాల్ని తక్షణం ఆపాలంటూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. తక్కువ స్థలంలో ఇళ్ళను కట్టడం, కేవలం మహిళా లబ్దిదారులకే ఇళ్ళను ఇస్తుండడం వంటివాటిపై పిటిషనర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది.

ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ మద్దతుదారులన్నది వైసీపీ ఆరోపణ. కాదు, ఎటూ ఈ పథకం ముందుకు సాగే పరిస్థితి లేదు గనుక, నిధుల కొరత అంశం బయటపడకుండా వుండేందుకు, వైసీపీనే తన మద్దతుదారులతో పిటిషన్ వేయించి, పథకాన్ని ఆపేయించుకుందన్నది టీడీపీ ఎదురుదాడి సారాంశం.

దొందూ దొందే… ఇలాంటి విషయాల్లో వైసీపీ – టీడీపీ స్పష్టమైన అవగాహనతో పనిచేస్తున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఎవరో పిటిషన్లు దాఖలు చేస్తే, కోర్టులు.. ఏమీ ఆలోచించకుండా తీర్పులిచ్చేస్తాయా.? అలాగైతే, ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎందుకు తిరస్కరణకు గురయినట్లు.? చాలా పిటిషన్ల విచారణ సందర్భంగా పిటిషన్ దారుల్ని న్యాయస్థానాలు హెచ్చరిస్తుంటాయన్నది ఇక్కడ ప్రస్తావనార్హం.

కోర్టుల మీద బురదచల్లి, తెరవెనుకాల తమ రాజకీయ లబ్ది నెరవేర్చుకోవడం అన్నది టీడీపీ, వైసీపీలకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడూ అదే జరుగుతోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రజలే, ఇలాంటి విషయాల్లో రాజకీయ పార్టీల కుట్ర, కుతంత్రాల్ని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సాయి ధరమ్ తేజ్‌ ను కలిసిన హరీష్‌ శంకర్‌

యాక్సిడెంట్‌ కు గురయ్యి చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న సాయి ధరమ్‌ తేజ్ ను సన్నిహితులు ఇంటికి...

ముక్కు అవినాష్‌ పెళ్లి తంతు పూర్తి

కమెడియన్‌ గా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ముక్కు అవినాష్ బిగ్‌ బాస్ కు వెళ్లినప్పటి నుండి పెళ్లి పెళ్లి అంటూ హడావుడి చేశాడు....

సమంత పరువు నష్టం దావా

స్టార్‌ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్‌ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. తాను విడాకుల గురించి సోషల్‌ మీడియాలో వెళ్లడించిన సమయంలో కొన్ని...

క్లైమాక్స్ కోసమే 50 కోట్లు ఎందుకు డార్లింగ్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. మూడేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం బోలెడన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ ను...

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నాడా? 2022 తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదు అని భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లోకి...

రాజకీయం

బాబు దీక్షకు పోటీగా వైకాపా దీక్షలు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటల దీక్షను చేసేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం...

హద్దు మీరితే ఇకపై కూడా ఇలాగే ఉంటుంది : సజ్జల

తెలుగు దేశం పార్టీ నాయకులు హద్దు మీరి దుర్బాషలాడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. వారు ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకునేది లేదు అంటూ సజ్జల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు...

నారా లోకేష్‌ ఉగ్ర స్వరూపం

ఏపీలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బంద్ పాటించేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు మాత్రం ఎక్కడికి...

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అవసరమా.? కాదా.?

అధికార పార్టీకి చెందిన నేతలైతే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి బూతులు తిట్టొచ్చు.. వాటిపై విపక్షాలకు చెందిన నేతలు సమాధానం కూడా చెప్పకూడదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు.. ఇంకోటేదో...

బీపీ, రియాక్షన్… ఇదేం సమర్థన సీఎం జగన్ గారూ.?

‘ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక నా మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. నన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో నన్ను అభిమానించేవారు, ప్రేమించేవారు బీపీకి...

ఎక్కువ చదివినవి

అఖిల్ సక్సెస్ లో అల్లు అర్జున్ భాగం!

అఖిల్ అక్కినేని ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న తొలి విజయం మొత్తానికి వచ్చేసింది. అఖిల్ మొదటి మూడు చిత్రాలు ప్లాప్ అవ్వడంతో నాలుగో సినిమా విజయం సాధించడానికి డెస్పెరేట్ గా ఎదురుచూశాడు. అఖిల్ నాలుగో చిత్రం...

రాష్ట్రంలో బొగ్గు గందరగోళం

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే బొగ్గు గనుల నుండి ఏపీకి రావాల్సిన బొగ్గు ను నిలుపుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించే వరకు బొగ్గు సరఫరా నిలిపి వేస్తున్నట్లుగా...

నో డౌట్, ‘మా’ యుద్ధంలో చిరంజీవిదే గెలుపు.!

గెలిచి ఓడిపోవడం.. ఓడి గెలవడం.. ఈ రెండిటికీ భిన్నమైన అర్థాలుంటాయి. నానా తంటాలూ పడి గెలిచినా, చివరికి అది ఓటమి కిందకే వస్తుంది. ఓడిపోయినా, ఒక్కోసారి.. ‘దీన్ని గెలవడం అంటారు..’ అనే అభిప్రాయం...

ఫ్యాను తిరగట్లేదు: ఘనత జగన్‌ది, నేరం మోడీది.!

దేశవ్యాప్తంగా బొగ్గు కొరత చాలా తీవ్రంగా వుందన్నది గత కొద్ది రోజులుగా వైఎస్ జగన్ సర్కార్ చెబుతున్న మాట. అసలు, బొగ్గు కొరత అన్న ప్రశ్నే తలెత్తబోదని కేంద్రం చెబుతోంది. తూచ్, బొగ్గు...

వైఎస్ జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి డీఎల్ సంచలన వ్యాఖ్యలు

కడప జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనుకబడినట్టేనని అన్నారు. 40ఏళ్ల తన...