Switch to English

Janasena: జనసేనాని వ్యూహం.! టీడీపీ, వైసీపీ రంగులు బయటపడుతున్నాయ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మచిలీపట్నం వేదికగా జరిగిన జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ‘పొత్తులు’ సహా అనేక అంశాలపై చేసిన కీలక వ్యాఖ్యలు, రాజకీయ వర్గాల్లో పెను దుమారానికి కారణమయ్యాయి. వంగవీటి రంగా ప్రస్తావన సహా, జనసేనాని చేసిన ప్రతి వ్యాఖ్య కూడా వైసీపీ, టీడీపీల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

గతంలో కంటే భిన్నంగా ఈసారి అటు వైసీపీ నుంచీ, ఇటు టీడీపీ నుంచి కూడా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద. టీడీపీ ప్రచారం చేస్తోన్న ‘ఇరవై సీట్ల’ అంశానికి జనసేన అధినేత ఇచ్చిన కౌంటర్ ఎటాక్ సహా, టీడీపీ అనుకూల మీడియా తెరపైకి తెచ్చిన వెయ్యి కోట్ల ప్యాకేజీ ‘గాలి వార్త’పై పవన్ కళ్యాణ్ మండిపాటు.. పెద్ద రచ్చకు కారణమవుతోంది.

ఎప్పుడూ ఉప్పూ.. నిప్పూ.. అన్నట్టుండే వైసీపీ, టీడీపీ.. ఈసారి ఒక్కటైనట్లే కనిపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా విభాగం చేస్తోన్న ట్రోలింగ్ కామెంట్స్‌ని టీడీపీ సోషల్ మీడియా విభాగం కాపీ పేస్ట్‌లా వాడేస్తోంటే.. సేమ్ టు సేమ్.. టీడీపీ కామెంట్లను వైసీపీ వాడేస్తోంది.

జనసేనను మిత్రపక్షంగా టీడీపీ గత కొంతకాలంగా భావిస్తోంది. అయితే, ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతవరకు నేరుగా, అధికారికంగా స్పష్టత ఇచ్చింది లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన వైపు వలపు బాణాలు విసురుతున్నారు. ‘జనసేనతో కలిసి పని చేస్తాం’ అని పలు సందర్భాల్లో చంద్రబాబు చెప్పారు.

తేనె పూసిన కత్తి చందాన.. పైకి ‘మైత్రి’ అంటూనే, తెరవెనుకాల జనసేనకు టీడీపీ వెన్నుపోటు పొడుస్తోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత వ్యూహాత్మకంగా పొత్తుల అంశాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాపు – కమ్మ – రెడ్డి.. ఇలా అన్ని సామాజిక వర్గాలూ ఒక్కటై జనసేనకు అండగా నిలవాలని జనసేనాని పిలుపునివ్వడం టీడీపీకి, వైసీపీకి నచ్చలేదు.

ఈ క్రమంలోనే రెండు పార్టీలూ ఏకమైన జనసేనను తూలనాడుతోంటే, ఈ అంశం జనబాహుళ్యంలోనూ చర్చకు కారణమవుతోందనీ, టీడీపీ, వైసీపీ వక్రీకరణల్ని సాధారణ ప్రజానీకం ఓ కంట కనిపెడుతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

ఎక్కువ చదివినవి

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...