ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి కుటుంబ సభ్యులు సాధించిన ఘన విజయం పై Jr ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పంచించారు. వారికి ‘X’ వేదికగా అభినందనలు తెలిపారు.
‘ ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రక విజయం సాధించినందుకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ది పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుతమైన మెజార్టీ సాధించిన లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీ లుగా గెలిచిన శ్రీ భరత్ కి, పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు ‘ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
‘ చరిత్రలో నిలిచిపోయే ఘన విజయాన్ని సాధించిన చంద్రబాబు మావయ్యకీ, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు!. మీ కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను. వరుసగా మూడో సారి హిందూపురం శాసనసభ్యుడిగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్ కు శుభాకాంక్షలు. భారీ మెజారిటీతో గెలుపొందిన లోకేష్, శ్రీ భరత్, పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు’ అని కళ్యాణ్ రామ్ పోస్ట్ చేశారు.
మంగళవారం వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 175 సీట్లకు గాను 164 స్థానాలు గెలుపొందింది. వైసీపీ 11 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదం లో పడింది.
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా…
— Jr NTR (@tarak9999) June 5, 2024
చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన @ncbn మావయ్యకీ, @JaiTDP నాయకులకు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు!
మీ కృషి మరియు పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను.వరుసగా మూడవ సారి హిందూపురం శాసనసభ్యుడుగా అఖండ విజయం…
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 5, 2024
Nice read, I just passed this onto a colleague who was doing a little research on that. And he actually bought me lunch as I found it for him smile So let me rephrase that: Thanks for lunch!