Switch to English

టిబి స్పెషల్: ‘ఇర్ఫాన్ ఖాన్’ లేఖ ఇప్పటికీ ఎప్పటికీ అందరికీ స్ఫూర్తి.!

జూన్, 2018.. బాలీవుడ్ లో ఓ కలకలం.. స్టార్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ కేన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనీ, కండీషన్ చాలా సీరియస్ గా ఉందనీ సోషల్ మీడియాలో ఒక వార్త దుమారం రేపుతోంది. మీడియా వారు అతని ఆరోగ్యంపై కథనాలు చేయడం కోసం కూపీ లాగుతుంటే, అభిమానించే వారు ఆయనకి ఏమీ కాకూడదని ప్రార్ధనలు చేస్తున్నారు. వారందరిలో ఉన్న సస్పెన్స్ ని పోగొట్టేలా బ్రిటన్ నుండి ఒక లేఖ రాసాడు.

ఆ లేఖ చదివగానే మనలో ఓ నూతన ఉత్తేజం కలుగుతుంది..
చనిపోవాలనుకున్న వారికి బీరకాలనే ఆశ చిగురిస్తుంది..
నిరుత్సాహంతో ఉన్న వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది ..
ఓడిపోయి డీలా పడిపోయిన వారిలో గెలుపు దీక్ష మళ్ళీ మొదలవుతుంది..

ఇరవై నెలల ముందు ఇర్ఫాన్ ఖాన్ రాసిన ఆ లేఖ మీ కోసం..

నేను హై-గ్రేడ్ న్యూరోఎండోక్రిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నానని కొన్ని వారాల క్రితమే తెలిసింది. ఆ పదాన్ని వినడం అదే మొదటిసారి. చాలా అరుదుగా వచ్చే కేన్సర్. తక్కువ కేసులు, తక్కువ రీసెర్చ్ మరియు తక్కువ ఇన్ఫర్మేషన్ కారణంగా, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో కూడా గెస్ చేయడం కష్టం. ప్రస్తుతానికి నేనొక ట్రయల్ అండ్ ఎర్రర్ గేమ్‌లో ఆట వస్తువుని.

ఇప్పటి వరకూ నేనొక ఆటలో ఉన్నాను. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తూ ఉన్నాను. నా జర్నీలో బోలెడన్ని డ్రీమ్స్, ప్రణాళికలూ, లక్ష్యాలూ ఉన్నాయి. వాటిలోనే పూర్తిగా మునిగిపోయాను. ఇంతలో అకస్మాత్తుగా ఎవరో నా భుజంపై గట్టిగా తట్టారు. తిరిగి చూస్తే టికెట్ కలెక్టర్. “మీ గమ్యం రాబోతోంది. దయచేసి దిగండి” అన్నాడు. నేను అయోమయంలో పడ్డాను. “లేదు, లేదు. నా గమ్యం రాలేదు” అన్నాను. “లేదు. వచ్చేసింది. ఇదంతే. కొన్నిసార్లు ఇలాగే అవుతుంది” అన్నాడు. నేను ట్రెయిన్ దిగిపోవాలి

అకస్మాత్తుగా వచ్చిన ఈ కుదుపు వల్ల, అస్తవ్యస్తంగా కదిలే సముద్రపు ప్రవాహాల్లో నేనొక తేలియాడే బెండు ముక్కనని అర్థమైంది.! బెండు ముక్కనై ఉండి సముద్రపు కదలికల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని అర్థమవుతోంది.

ఇంత గందరగోళంలో, షాక్ లో ఉంటూ, ఒకసారి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, “ప్రస్తుతానికి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడమే నా నుండి నేను ఆశించేది. భయం నన్ను అధిగమించకూడదు. అది నన్ను పిరికివానిగా మార్చకూడదు” అంటూ ఏవేవో సూక్తులు నా కొడుకుతో వాగాను. నేనలా ఉండగలనని, ఉన్నానని ఫీలయ్యాను. ఇంతలో బాధ నన్ను కుదిపేసింది. అప్పుడే అర్ధమయింది. ఇంతకాలం నేను బాధ గురించి వివరణలు తెలుసుకున్నానని, ఇప్పుడే మొదటిసారి బాధ యొక్క స్వభావాన్ని, దాని తీవ్రతనీ అనుభవిస్తున్నానని. ఏదీ ఆ బాధని ఆపలేకపోయింది. ఏ ఓదార్పు ఏ మోటివేషన్ పని చేయలేదు.

నేను అలసిపోయి, నిస్పృహలో హాస్పిటల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు, నా హాస్పిటల్ లార్డ్స్ స్టేడియం ఎదురుగా ఉందన్న విషయాన్ని గ్రహించనేలేదు. ఆ మైదానాన్ని చూడటం నా చిన్ననాటి కల. బాధ మధ్యలో, అక్కడ నవ్వుతూ ఉన్న వివియన్ రిచర్డ్స్ పోస్టర్ చూసాను నాలో ఏ చలనమూ లేదు. ఆ ప్రపంచం ఎప్పుడూ నాకు చెందినది కాదు అనిపించింది.

ఒకసారి, హాస్పిటల్ బాల్కనీలో నిలబడి ఉండగా, విచిత్రమైన ఆలోచన నన్ను కదిలించింది. జీవితమనే ఆటకూ మరణమనే ఆటకూ మధ్యలో ఒక రోడ్డు మాత్రమే ఉంది. ఒక వైపు హాస్పిటల్ మరొక వైపు స్టేడియం. నిజానికి నేను హాస్పిటల్ లేదా స్టేడియంలో ఎందులోనూ భాగం కాదు. ఎందుకంటే దేనిలోనూ నిశ్చయత్వం లేదు. ఆ ఆలోచన భూకంపంలా కుదిపేసింది.

అనంత విశ్వం యొక్క ఇంటెలిజెన్స్ ముందు నేనొక చిన్న ధూళి కణంలా మిగిలిపోయాను. నా హాస్పిటల్ కి ముందే స్టేడియం ఉండటం నన్ను గట్టిగా హిట్ చేసింది. నిశ్చయముగా చెప్పగలిగేది అనిశ్చితి(uncertainty) ఒక్కటే. నేను చేయగలిగేది నా బలాన్ని గుర్తెరిగి, ఈ ఆటను బాగా ఆడటమే.

“ఈ అవగాహన, నన్ను ఫలితంతో సంబంధం లేకుండా జీవితాన్ని స్వీకరించేలా చేసింది. ఇది నన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో తెలియదు. ఇప్పటి నుండి ఎనిమిది నెలలా, నాలుగు నెలలా, లేదా రెండు సంవత్సరాలా అన్నది సంబంధం లేకుండా నన్ను నేను సమర్పించుకోవడానికి సన్నద్ధం చేసింది. అప్పటి వరకూ ఉన్న ఆందోళనలన్నీ వెనుక్కిపోయి మసకబారి, నా మైండ్ స్పేస్ నుండి బయటకు పోయాయి.

మొదటిసారి, ‘స్వేచ్ఛ’ యొక్క నిజమైన అర్థం తెలిసింది. ఇదే జీవిత సాఫల్యం అనిపించింది. నేను మొదటిసారి జీవితాన్ని రుచి చూస్తున్నట్లుగా ఉంది. అనంత విశ్వం యొక్క ఇంటెలిజెన్స్ పై నమ్మకం కలిగింది. నా విశ్వాసం సంపూర్ణంగా మారింది. ఆ ఇంటెలిజెన్స్ నా ప్రతి కణంలోకి ప్రవేశించినట్లు ఫీలయ్యాను. ఇదిలాగే ఉంటుందో లేదో సమయం చెబుతుంది, కానీ ప్రస్తుతానికి ఇలా భావిస్తున్నాను.

నా ప్రయాణంలో ప్రజలు నా బాగు కోరుకుంటున్నారు. ప్రపంచం నలుమూలల నుండి నా కోసం ప్రార్థిస్తున్నారు. నాకు తెలిసిన వ్యక్తులు, తెలియని వ్యక్తులు. వారు వేర్వేరు ప్రదేశాల నుండి, వేర్వేరు టైం జోన్స్ నుండి ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలన్నీ ఒకటవుతున్నాయని నేను భావిస్తున్నాను. అవన్నీ ఒక పెద్ద శక్తిగా, కరెంట్ ఫోర్స్ లాగా, నా వెన్నెముక చివరలో నా లోపలికి ప్రవేశించి నా శిరస్సు పై భాగానికి చేరాయి.

ఆ శక్తి మొలకెత్తుతోంది – వేర్లు ఏర్పడుతున్నాయి, ఆకులూ, కొమ్మలుగా పెరుగుతూ మొగ్గ తొడుగుతూ ఎదుగుతోంది. ఇదంతా ఫీలవుతూ నేను ఆనందిస్తూనే ఉన్నాను. ఈ బుడ్డి బెండు ముక్క సముద్ర ప్రవాహాల్ని నియంత్రించాల్సిన అవసరం లేదు. ప్రకృతి ఒడిలో సున్నితంగా ఊయలూగితే చాలు.

                                                                                            _✍️ ఇర్ఫాన్ ఖాన్ (జూన్, 2018)

                                            ఇర్ఫాన్ ఖాన్ లేఖను తెలుగు భావానువాదం చేసిన రచయిత: ✍️ రాంబాబు తోట..

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: ఇంట్లోకి పాములు వస్తున్నాయని ఊరు వదిలి పెట్టారట

కంప్యూటర్ కాలంలో కూడా కొందరు మూఢ నమ్మకాలు పాటిస్తూ, వాటిని నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ భీందు జిల్లాలో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంట్లో దాదాపుగా 120...

చైనా ఆరు రోజుల ఆలస్యం.. ప్రపంచం అల్లకల్లోలం!

ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా వైరస్ కు కారణం ఎవరు అని అడిగితే.. ఠక్కున చైనా అనే సమాధానమే వస్తుంది. కావాలనే సృష్టించారో లేక ప్రపంచం కర్మ కొద్దీ వచ్చిందో అనే విషయాన్ని...

జగన్‌ సర్కార్‌కి ఝలక్‌: డాక్టర్‌ సుధాకర్‌ కేసు సీబీఐకి.!

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మత్తు డాక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌ సుధాకర్‌ ఉదంతంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది వారాల్లో మద్యంతర నివేదిక అందించాలని ఈ...

ఫ్లాష్ న్యూస్: రెండు నిమిషాల్లో 70 వేల ఫోన్స్‌ అమ్ముడు పోయాయి

గత రెండు నెలలుగా ఈకామర్స్‌ బిజినెస్‌ పూర్తిగా స్థంభించిన విషయం తెల్సిందే. ప్రతి రోజు వందల కోట్ల వ్యాపారం స్థంభించడంతో ఈకామర్స్‌ సంస్థలు భారీగా నష్టపోయారు. ఇక మొబైల్‌ అమ్మకాలు కూడా పూర్తిగా...

‘‘లవ్ స్టోరీ’’ నిర్మాత తోనే శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా కన్ఫార్మ్

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా కన్ఫార్మ్ అయ్యింది.ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి లతో 'లవ్ స్టోరీ' మూవీ చేస్తున్న కమ్ముల ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజుల...