ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రా ప్రాంతం పెద్దగా అభివృద్ధికి నోచుకోకపోయినా.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సజావుగా సాగిపోయారు. ప్రత్యేకవాదం మొదలయ్యి.. రాజకీయాలు చేసి అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గొప్పలకు పోయేందుకు రాష్ట్రాన్ని రెండుగా చీల్చింది. పోనీ విడదీసింది… విడదీసిన కేంద్రమే అన్ని సర్దిపెట్టాలి.. ఇది నీకు ఇది అతనికి అన్ని పంపాలకు చేసిన తరువాత దిగిపోవాలి.
తాంబూలలు ఇచ్చేశాం తన్నుకు చావండి అనే రీతిగా.. కొత్త రాష్ట్రాన్ని ఇచ్చేశాం మీ చావు మీరు చావండి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. విభజనపై ఎన్నో ఎన్నో అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి.. కేంద్రంలో అధికారంలో మార్పు జరగడం… అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన పార్టీ, అధికారంలోకి వచ్చాక కప్పదాటు వ్యవహారం చేసింది.
రాష్ట్రంలో ఉన్న పచ్చపార్టీ కూడా దానికే సపోర్ట్ చేసి.. చట్టసభల్లో తీర్మానం చేసి పంపించారు. రాజధాని పేరుతో గత ప్రభుత్వం బిల్డింగులను నేలపై కాకుండా పేపర్ పై చూపించేందుకు కోట్లకు కోట్లు తగలేసింది.
ఎన్నికలు దగ్గరకు వచ్చే పచ్చ ప్రభుత్వం తూచ్ మేము అలా అనలేదు.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక తీసుకొస్తామని హడావుడి చేసింది. హడావుడి తప్పా అక్కడ ఏమి కనిపించలేదు. చివరకు ప్రజలు సైకిల్ కు పంచర్ చేసి హాయిగా ఫ్యాను కింద రెస్ట్ తీసుకుందామని అనుకున్నారు. సైకిలే అనుకుంటే ఫ్యాన్ కూడా అదే బాటలో పయనించడం మొదలుపెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఖజానాను ఖాళీ చేశారు.
గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆదాయం భారీగా తగ్గింది. ఆదాయం వచ్చే మార్గాలు ఆలోచించకుండా ఏకాడికి పధకాలు అమలు చేయాలని కూర్చుంటే సరిపోతుందా.. పధకాలు అమలు జరగాలి అంటే డబ్బు కావాలి కదా. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యంపై సమ్మెటపోటు పడటంతో ఆదాయం తగ్గిపోయింది. రెవిన్యూ కొన్ని ఇతర శాఖల్లో ఆదాయం భారీగా తగ్గిపోయింది. అధికారాన్ని నింపుకోవడం కోసం ఆదాయాన్ని శూన్యంగా మార్చడం అంటే ఇదేనేమో..
920953 35027quite very good post, i surely love this internet site, go on it 392555
822760 461443Deference to internet site author , some excellent entropy. 192008
292678 531783I dont normally take a look at these kinds of websites (Im a pretty shy person) – but even though I was a bit shocked as I was reading, I was undoubtedly a bit excited as effectively. Thanks for giving me a big smile for the day 158341