బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్‌లో టేస్టీ తేజ జర్నీ ముగిసింది. శని, ఆదివారాల్లో వరుస ఎలిమినేషన్ల నేపథ్యంలో శనివారం ఎపిసోడ్‌లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించాడు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన టేస్టీ తేజ, షరామామూలుగానే హౌస్‌లో ఎంటర్టైన్ చేశాడు.. అటు తోటి కంటెస్టెంట్లనీ, ఇటు బిగ్ బాస్ వీక్షకుల్నీ. తన భారీ కాయాన్ని సైతం లెక్క చేయకుండా టాస్కుల్లో చురుగ్గా కదిలాడు. నిజానికి ఎప్పుడో ఎలిమినేట్ అవుతాడనుకున్న టేస్టీ తేజ, ఇక్కడిదాకా రావడం ఆశ్చర్యకరమే.
బాగా ఆడేవాళ్ళని ముందే ఎలిమినేట్ చేసెయ్యడం అనేది బిగ్ బాస్‌లో ఎప్పుడూ జరుగుతున్నదే. ఇదే విషయాన్ని విష్ణు ప్రియ, అక్కినేని నాగార్జునతో పరోక్షంగా తాజా ఎపిసోడ్‌లో చెప్పేసిందనుకోండి.. అది వేరే సంగతి.
కాగా, బిగ్ హౌస్ నుంచి బయటకు వచ్చాక టేస్టీ తేజ మీడియాతో మాట్లాడాడు. ఈసారి సీజన్ విన్నర్ అయ్యేది గౌతమ్ కృష్ణ అని తన బలమైన నమ్మకమని చెప్పాడు. బాగా ఆడమని గౌతమ్‌కి చెప్పి వచ్చానంటున్నాడు టేస్టీ తేజ.
మరోపక్క, హౌస్‌లోకి తన తల్లిని తీసుకెళ్ళడమే తనకు బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అని హోస్ట్ అక్కినేని నాగార్జునతో టేస్టీ తేజ చెప్పాడు. ఫ్యామిలీ వీక్ సందర్భంగా టేస్టీ తేజ చుట్టూ హైడ్రామా నడిచింది. టేస్టే తేజ కుటుంబ సభ్యుల్ని హౌస్‌లోకి చివర్లో పంపించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తేజ వెక్కి వెక్కి ఏడ్చాడు. అంతలా ఏడ్పించినా, చివరికి టేస్టీ తేజ కోరిక మేరకు అతని తల్లిని హౌస్‌లోకి బిగ్ బాస్ పంపించాడు.
ఇదిలా వుంటే, తోటి కంటెస్టెంట్లను జడ్జ్ చేయడంలో తేజ చాలా స్మార్ట్‌గానే వ్యవహరించేవాడు. కాకపోతే, అతను సీరియస్‌గా వున్నా, దాన్ని కామెడీగానే లైట్ తీసుకున్నారు తోటి కంటెస్టెంట్లు.