సొట్టబుగ్గల చిన్నది తాప్సి కెరీర్ బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. సౌత్ లో జుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న తాప్సి కి ఆ తరువాత వరుస అవకాశాలైతే వచ్చాయి .. కానీ కెరీర్ పరంగా మంచి సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో అటు తమిళంలో కూడా గట్టి ప్రయత్నాలు చేసింది. అక్కడ కూడా అదే పరిస్థితి. దాంతో ఇక్కడ లాభం లేదనుకుని బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన వేళా విశేషమో కానీ అక్కడ మాత్రా బాగా వర్కవుట్ అయింది.
ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో అందాలు ఆరబోస్తూ .. మరో వైపు భిన్నమైన సినిమాలు చేస్తూ రెండు రకాలుగా క్రేజ్ తెచ్చుకుంది తాప్సి. బాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలంటే అందరు తాప్సి వైపే చూసేలా మారింది పరిస్థితి. పింక్, బద్లా లాంటి సినిమాల్లో నటిగా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది తాప్సి.
తాజగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది కానీ ఆ జోనర్ లో మాత్రం సినిమాలు చేయను. ఆ జోనర్ ఏమిటో తెలుసా .. సెక్స్ కామెడీ సినిమాలు. ఇదివరకే సెక్స్ కామెడీ సినిమాలు చాలా చూసా .. అందులో హీరోయిన్స్ పై డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ .. ఓవర్ స్కిన్ షో .. బూతులు .. అబ్బో అలాంటి సినిమా అయితే చేయను.
ఈ విషయంలో డైరెక్టర్స్ ని తప్పు పట్టలేం .. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం మొత్తం ప్రేక్షకులను ఎలా నవ్వించాలా అన్న ఆలోచనే ఉంటుంది. కాబట్టి ఆ తరహా సినిమాల్లో బూతుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది అని చెప్పింది. మొత్తానికి సినిమాల విషయంలో తాప్సికి మంచి క్లారిటీ వుండే అని అనుకుంటున్నారు సినీ జనాలు !!
