తండేల్ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని, ఎమోషనల్ హై ఇస్తుందని హీరో అక్కినేని నాగచైతన్య అన్నారు. ఆయన హీరోగా సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన మూవీ తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్య ప్రెస్ మీట్ లో మూవీ విశేషాలను పంచుకున్నారు. ఇప్పటికే సినిమా చూశాం. కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. చివరి 30 నిముషాలు ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. శ్రీకాకుళం వెళ్లి అక్కడ మత్స్య కారులను కలిసి హోం వర్క్ చేశాను. అందుకే ఈ మూవీలో చాలా నేచురల్ గా కనిపిస్తానని నాగచైతన్య అన్నారు.
మొదటిసారి నాకు రియల్ లైఫ్ క్యారెక్టర్ దొరికింది. నటుడిగా ఈ సినిమాతో నేను నెక్ట్స్ లెవల్ కు వెళ్తానని అనుకుంటున్నాను. చందుతో నాకు ఇది మూడో సినిమా. అతని వర్క్ స్టైల్ నాకు ఇష్టం. అందుకే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఈ మూవీ లవ్ స్టోరీ బేసిక్ గా సాగుతుంది. దాని చుట్టూ ఉండే సీన్లు అందరినీ కట్టిపడేస్తాయని చైతూ చెప్పారు. గీతా ఆర్ట్స్ ప్రొడక్ట్ బాగుంటుంది. అందుకే వాళ్లతో మళ్లీ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఇప్పుడు కుదిరింది. సాయిపల్లవి ఫెంటాస్టిక్ యాక్టర్. ఆమె నటన ఇందులో సరికొత్తగా ఉంటుంది.
దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాకు మంచి బలం ఇచ్చింది. ఆయనతో ఏ సినిమా చేసినా అది నాకు మంచి పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తుందని చైతూ వెల్లడించారు. అమీర్ ఖాన్ కు కూడా ట్రైలర్ బాగా నచ్చింది. అందుకే బాలీవుడ్ లో ఆయన ప్రమోట్ చేశారు. ఈ మూవీలో రాజు పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ చైతూ మూవీ విశేషాలను చెప్పుకొచ్చారు.