ఇప్పుడు టాలీవుడ్ లో జానీ మాస్టర్ వివాదం ఓ వైపు నడుస్తుండగానే.. ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. పూనమ్ కౌర్ ఎంట్రీతో త్రివిక్రమ్ పేరు మార్మోగిపోతోంది. ఎప్పుడూ వివాదంలో ఉండే పూనమ్ కౌర్ అదును చూసి ట్వీట్ చేసింది. జానీ మాస్టర్ వివాదం నడుస్తున్నప్పుడే తాను కూడా స్పందిస్తే తనను పట్టించుకుంటారని అనుకుందేమో. తాను గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కూడా ఫిర్యాదు చేశానని.. కాకపోతే తనకు బ్యాక్ గ్రౌండ్ లేదని పట్టించుకోకుండా పక్కకు పెట్టేశారంటూ ఆమె ఆరోపించింది. ముందు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలంటూ ఆమె డిమాండ్ చేసింది.
దాంతో ఇప్పుడు ఇదే విషయం మీద ఫిల్మ్ ఛాంబర్స్ అసోసియేషన్ సభ్యుడు అయిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు దీనిపై ప్రశ్నిస్తే మాట్లాడారు. పూనమ్ కౌర్ ఫిర్యాదు చేసినట్టు మాకు ఇప్పటి వరకు తెలియదు. ఒకవేళ మహిళా ప్యానెల్ స్టార్ట్ చేయక ముందు ఆమె ఫిర్యాదు చేసి ఉంటే అది మా వరకు రాదు. కాబట్టి దానిపై మాకు సమాచారం రాలేదు. ఒకవేళ ఆమె మళ్లీ ఫిర్యాదు చేస్తే దానిపై విచారించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన కామెంట్లతో ఇప్పుడు త్రివిక్రమ్ మీద పూనమ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. భరద్వాజ మాటలతో పూనమ్ మరోసారి గనక ఫిర్యాదు చేస్తే అప్పుడు త్రివిక్రమ్ ఇబ్బందుల్లో పడుతాడని అంటున్నారు. అప్పుడు ఫిల్మ్ ఛాంబర్స్ త్రివిక్రమ్ ను పిలిచి విచారిస్తుందా లేదంటే అంత పెద్ద డైరెక్టర్ జోలికి పోకుండా సైలెంట్ గా ఉండిపోతుందా అనేది తెలియాల్సి ఉంది.