రామ్ పోతినేని హీరోగా మహేశ్ బాబు పి డైరెక్షన్ లో కొత్త సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. రాపో-22 ను వర్కింగ్ టైటిల్ కింద పెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. అయితే రామ్ ప్రతిసారి తన సినిమాతో కొత్త ఆర్టిస్టులను, ట్యాలెంటెడ్ టెక్నీషియన్లను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆయన సినిమా కోసం తమిళ సంగత దర్శకులను తీసుకొస్తున్నారు. వీరిని ఈ సినిమాతోనే తెలుగు సినిమాకు పరిచయం చేస్తున్నారు. వారే తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్ – మెర్విన్.
వీరి ఎంట్రీని కన్ఫర్మ్ చేస్తూ హీరో రామ్ పోతినేని వెల్ కమ్ చెబుతూ ట్వీట్ చేశాడు. వివేక్ శివ, మెర్విన్ సాల్మన్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. మ్యూజిక్ పై ఇద్దరికీ మంచి పట్టు ఉంది. వీరిద్దరూ కలిసి వివేక్ – మెర్విన్ పేరుతో సినిమాలకు సంగతం అందిస్తున్నారు. వీరిద్దరూ మ్యూజిక్ అందించిన ‘ఓర్శాడా’, ‘పక్కం నీయుమ్ ఇళ్లై’ భారీ హిట్ అయ్యాయి. దాంతో పాటు ‘చిల్ బ్రో, ‘గులేబకావళి’లోని గులేబా సాంగ్, ‘సుల్తాన్’ సినిమాలోని పాటలు భారీ క్రేజ్ ను తెచ్చుకున్నాయి. దాంతో వారిని ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.
దాంతో ఈ వార్త ఒక్కసారిగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. వీరిద్దరూ ఈ మధ్య యూత్ ను ఊపేసే పాటలు చేస్తున్నారు. మరి రామ్ సినిమాకు ఎలాంటి పాటలను అందిస్తారో చూడాలి.