తమిళ మెగా బ్రదర్స్ సూర్య మరియు కార్తీ కలిసి నటించే సమయం కోసం వారి ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. వారిద్దరికీ కూడా కలిసి నటించాలనే ఆసక్తి ఉన్నా కూడా మంచి కథ దొరకడం లేదట. ఎట్టకేలకు వీరిద్దరు కలిసి ఒక సినిమాలో నటించారు. సూర్య సినిమాలో కార్తీ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు.
పాన్ ఇండియా రేంజ్ మూవీగా రూపొందిన సూర్య కంగువ సినిమాలో కార్తీ ని గెస్ట్ రోల్ లో చూపించబోతున్నట్లు తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో కార్తీ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అయినా కూడా అన్న సినిమా కంగువ లో చిన్న గెస్ట్ రోల్ లో నటించాడట.
అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కంగువ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. తెలుగు నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాను జ్ఞానవేల్ రాజాతో కలిసి నిర్మించారు. భారీ బడ్జెట్ తో సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రూపొందింది. దాదాపు రెండేళ్ల టైమ్ తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. వెయ్యి కోట్ల టార్గెట్ తో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది.