తమిళంలో సూపర్ హిట్ అయిన మండేలా ను తెలుగు లో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అనీల్ సుంకర ఈ సినిమా రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అనీల్ సుంకర బ్యానర్ లో సునీల్ ఒక సినిమాను చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఆ సినిమా పూర్తి అవ్వకుండానే మండేలా సినిమా రీమేక్ కోసం అనీల్ సుంకర ఏర్పాట్లు చేస్తున్నాడని తెలుస్తోంది.
యోగి బాబు కీలక పాత్రలో తెరకెక్కిన మండేలా సినిమా ఆకట్టుకునేలా ఉంది అంటూ కామెంట్స్ వచ్చాయి. భారీ ఎత్తున సినిమా కు ఆధరణ వచ్చింది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి తెలుగు లో ఈ రీమేక్ ను పట్టాలెక్కించబోతున్నారు. తెలుగు లో ఈ రీమేక్ కు ఏ దర్శకుడు దర్శకత్వం వహిస్తాడు అనేది చూడాలి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత సునీల్ మండేలా రీమేక్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది.
799516 554272Interesting point of view. Im curious to believe what type of impact this would have globally? Sometimes men and women get a little upset with global expansion. Ill be around soon to take a look at your response. 232103