Tamil Actors as childs: ప్రస్తుత డిజిటల్ విప్లవంలో సరికొత్త సాంకేతిక విప్లవం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). ఎన్నో అద్భుతాలు కూడా ఆవిష్కృతమవుతున్నాయి. ఇటివలే.. ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ ఆధారంగా దక్షిణాది హీరోలు.. చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు. త్రిష.. తదితరులను గేమింగ్ డ్రెస్ ధరించినట్టున్న ఇమేజెస్ ఏఐ సాయంతో సృష్టించాడో వ్యక్తి. ఇప్పుడిలానే మరో అభిమాని కోలీవుడ్ స్టార్స్ ను చిన్నారులుగా క్రియేట్ చేశాడు.
వీరిలో రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, విక్రమ్, సూర్య, అజిత్, ధనుష్, త్రిష, నయనతార.. వంటి సూపర్ స్టార్స్ ఉన్నారు. వీరితో ఫొటోలు క్రియేట్ చేసి వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘కోలీవుడ్ యాక్టర్స్ చైల్డ్ వుడ్ ఏఐ వెర్షన్’ వీడియో పేరుతో నెట్టింట వైరల్ అవుతోంది. సో క్యూట్ కిడ్స్.. అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ మురిసిపోతున్నారు. మరో వీడియోలో సిల్క్ స్మితను కూడా అనేక రూపాల్లో చూపించి ఆసక్తి రేకెత్తించారు.