Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ఇటివల ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, బ్రేకప్ విషయాలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం. అయితే.. ఇప్పటికే నాకు జీవితంలో రెండుసార్లు బ్రేకప్ జరిగింది. దీంతో నా హృదయం ముక్కలైంది. ఎంతో బాధ అనిపించింది. తొలిసారి టీనేజ్ లో హార్ట్ బ్రేక్ ఎదుర్కొన్నా. ఓ వ్యక్తి కోసం అప్పుడే జీవితాన్ని వదులుకోవాలని అనిపించలేదు. జీవితంలో అన్వేషించాలనుకుని ఆ బంధం వదులుకున్నా’.
‘మరోసారి.. ఇంకో వ్యక్తితో రిలేషన్ లో ఉన్నా. అయితే.. ప్రతి సందర్భానికీ అబద్ధాలు చెప్పడం నచ్చలేదు. దీంతో అతడు నాకు సరిపోడని వదిలేసుకున్నా. ఇలా రెండుసార్లు నా మనసు గాయపడింద’ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విజయ్ వర్మతో తమన్నా రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. లస్ట్ స్టోరీస్ సమయంలో ప్రేమలో పడినట్టు తమన్నా గతంలో వెల్లడించింది.
ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తమన్నా.. ఇటివలే స్ట్రీ-2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
