‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా రూపొందిన ‘ఓదెల 2’ ఏప్రిల్ 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇటీవలే కుంభమేళాలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయడంతో మంచి స్పందన దక్కింది.
విడుదల తేదీని ప్రకటించేందుకు గాను ‘ఓదెల 2’ చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో తమన్నాను షాకింగ్ లుక్‌లో మేకర్స్ ప్రజెంట్ చేశారు. సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. నాగ సాధువుగా తమన్నాను విభిన్నంగా దర్శకుడు అశోక్ తేజ చూపించనున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ స్టఫ్‌ను చూస్తే అనిపిస్తోంది.
మీడియా సమావేశంలో తమన్నా మాట్లాడుతూ… దర్శకుడు అశోక్ గారు ఓదెలను అద్భుతంగా తీశారు. ఆ సినిమా చూసిన సమయంలోనే సీక్వెల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సంపత్ నంది గారు పార్ట్ 2 ఐడియాతో నా వద్దకు వచ్చారు. కథ విన్నప్పుడే అద్భుతంగా అనిపించింది. దర్శకుడు అశోక్ గారు సినిమాను నెక్ట్స్ లెవల్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాలో నేను భైరవి పాత్ర చేశాను. ఈ సినిమాలో భైరవి పాత్రను చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది థియేటర్‌లోనే చూడాల్సిన మంచి సినిమా అని చెప్పుకొచ్చింది.
నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. దేవుడి ఆశీర్వాదంతో సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. తప్పకుండా ఈ సినిమా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం ఉంది. 10 ఏళ్ల క్రితం తమన్నాను ఏ డెడికేషన్‌తో చూశానో ఇప్పుడు అదే డెడికేషన్‌తో ఓదెల 2 లో నటించింది. తప్పకుండా ఈ సినిమా ఆమెకు మరో హిట్‌ను తెచ్చి పెడుతుందని అన్నాడు.