ఏపీ అభివృద్ధికి తైవాన్ సహకరించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల అభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ తైవాన్ సహకారం కోరారు. ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్ తో నారా లోకేష్ చర్చలు జరిపారు.
ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ తయారీ రంగాల్లో ఇప్పటికే తైవాన్ ప్రధమ స్థానంలో ఉంది. ఈ సమావేశంలో ఏపీలో అభివృద్ధికి తైవాన్ ప్రతినిధుల బృందాన్ని తీసుకొచ్చి వారి విధి విధానాలను తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రంగాల్లో అభివృద్ధి జరిగేలా పాలసీలు, అనుమతులు ఇంకా ఉత్పత్తి ప్రారంభం కోసం ప్రభుత్వం సహకారం గురించి లోకేష్ చెప్పారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ పద్దతిలో కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా వివరించారు. 2014-19 వరకు తిరుపతిలో ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి కల్పించిన సదుపాయాలు, ఏర్పాటైన కంపెనీల ద్వారా లభించిన ఉద్యోగాల గురించి తైవాన్ బృందానికి వెల్లడించారు లోకేష్. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఫుట్ వేర్, టెక్స్ టైల్స్ రంగాల ద్వారా లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకే వీటిని ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి పనిచేస్తున్నామని అన్నారు మంత్రి నారా లోకేష్.
తైవాన్ లో ఉన్న కంపెనీలు వరల్డ్ వైడ్ గా విస్తరించాలని చూస్తున్నాయి. ఆ కంపెనీలు ఆధ్రప్రదేశ్ వచ్చేందుకు సహకారం అందించాలని తైవాన్ బృందాన్ని లోకేష్ కోరారు. తైవాన్ బృందం కూడా ఏపీలో అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. మంత్రి నారా లోకేష్ తో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరన్ రిచర్డ్ చెన్, nexusindo consultancy ఎం.డి ఎరిక్ చాంగ్, pou chen corporation వెల్బర్ వ్యాంగ్, ఏపీ ప్రభుత్వం తరపున ఎకనామిక్ డెవెలప్మెంట్ బోర్డ్ సీ.ఈ.ఓ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.